ప్రజాప్రతినిధులు.. అధికార్లు కలిసి వ్యభిచారం
వ్యభిచారం కూడా కొత్త పుంతు తొక్కుతుంది. మారుతున్న కాలనీకి అనుగుణంగా వారి వ్యాపారమూ మారుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకోని నయా సెక్స్‌ని అందిస్తున్నారు. టచ్ చేయకుండనే సుఖాన్ని అందిస్తున్నారు. ఇదేదో మహా నగరాల్లోనో.. కార్పొరేట్ స్థాయిలోనో జరుగుతుందంటే మీరు నిరోద్లో వేలెట్టినట్టే. మారుమూల పట్టణాలు, గ్రామాలకు చెందిన యువతులతో చిన్నచిన్న పట్టణాల్లోనూ కొనసాగుతున్నాయి. విటులు వ్యభిచార గృహానికి వెళ్లకుండా డోర్ డెలవరీ ఆప్షన్ ను నిర్వాహకులు అందిస్తున్నారు.
సమాజంగా మనం వాట్సాప్‌ల్లో ఫ్రెండ్స్, లేదా ఎంప్లాయూస్, స్వచ్ఛంద సేవలు, యువజన సంఘాలు, బాల్య మిత్రులు, మై పేర్సెంట్స్ ఇలా రకరకాల గ్రూపులను క్రియేట్ చేస్తాం. కానీ వ్యభిచారకేంద్రం నిర్వాహకులు ఓ అడుగు ముందుకేసి వ్యభిచారం కోసం వాట్సాప్ గ్రూప్ ను క్రియోట్ చేస్తున్నారు. దీనిలో డబ్బులు అవసరాలను ఉన్న యువతుల వివరాలను సేకరించి వారి ఫొటోలను పెడుతున్నారు. ఈ గ్రూపుల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ చదివే యువకులు ఉంటున్నారు. మరికొన్ని గ్రూపుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు నంబర్లు ఉండడంతో పోలీసులను విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నయా వ్యభిచార దందా సూర్యాపేట జిల్లాలో ఇటీవల వెలుగు చూసింది. పోలీసులు అందిన విశ్వాసనీయం సమాచారం ప్రకారం వ్యభిచారకేంద్రంపై దాడులు చేశారు. నిర్వాహకుల మోబైల్ ఫోన్లను పరిశీలించగా రెగ్యులర్ కస్టమర్ల పేరు తో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వాట్సాప్ గ్రూప్ ను పరిశీలించిన పోలీసులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. ఈ వాట్సాప్ గ్రూప్ లో తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికార్లు, పోలీసుల పేర్లు ఉండడం తో పోలీసులు అవాక్కైయ్యారు. కోదాడ పట్టణంలో నివసిస్తున్న దంపతులు.. ఈజీ గా డబ్బు సంపాదించాలనే దుర్బుద్దితో గుట్టుచప్పుడుకాకుండా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతులతో వ్యభిచారం నడుపుతున్నారు.
పక్కా సమాచారంతో వారి ఇంటిపై పోలీసు దాడి చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వారు పేర్లు తక్షణమే బయట పెట్టాలని, వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోని, కోదాడలో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.