అరికాళ్ల మంటలకు చెక్ పెట్టండిలా..

Kavya Nekkanti
సాధార‌ణంగా ఎక్కువ శాతం మంది అరికాళ్ల మంట‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. రకరకాల కారణాల వలన ఈ సమస్యని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూ ఉంటారు. అరికాళ్లు మంట‌లు అంటే న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌. అరికాళ్లు వ‌ర‌కు న‌రాలు ప‌నిచేసేట‌ప్పుడు వాటి శ‌క్తి త‌గ్గుతుంది. వీటివలన వేడిగా, సూదులు గుచ్చినట్లుగా నొప్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. వాస్త‌వానికి అవయవాలకు రక్త ప్రసరణ తక్కువగా జరగడంవలన ఈ పాదాల మంటలు ఏర్పడతాయి.


అదే విధంగా యంగ్ ఏజ్‌లో విట‌మిన్ బి12 లోపించ‌డం వ‌ల్ల వ‌స్తుంది. విట‌మిన్ బి12 త‌గ్గిపోతే ఇలా కాళ్లు మండుతాయి. ఇంకొ ముఖ్య కార‌ణం డ‌యాబెటీస్‌. షుగ‌ర్ ఉన్న‌వాళ్ల‌కి కూడా అరికాళ్లు మండుతాయి. మూడ‌వ‌ది వెన్నుపూస అరిగిపోవ‌డం. ఇలా ఎన్నో కార‌ణాల వ‌ల్ల అరికాళ్లు మంట‌లు వ‌స్తాయి. దీనికి చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు త‌ప్ప‌ని స‌రిగా ఉప‌యోగించాలి..


- గోరువెచ్చని నీటిలో అరికాళ్ళను ఉంచితే పావుగంటలో అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. ఈ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే పాదాల నొప్పులు కూడా తగ్గిపోతాయి.


- ప్రతిరోజూ పది నిమిషాలు అల్లం రసం, ఆలివ్‌ లేదా కొబ్బరినూనె కలిపిన వెచ్చని మిశ్రమంతో పాదాలను, కాళ్లను మర్దన చేయటం వలన నొప్పి తగ్గుతుంది. రక్త ప్రసరణ చురుగ్గా జరిగి ఉపశమనం కలుగుతుంది.


- విటమిన్‌ బి3 పుష్కలంగా ఉన్న గుడ్డు పచ్చసొన, పాలు, బఠాణీలు, చిక్కుళ్ళు వంటి పోషక ఆహార వినియోగాన్ని పెంచడం వలన పాదాల మంటలకు ఒక సాధారణ సహజపద్ధతిలో నివారణ కలుగుతుంది.


- ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాన్ని ముఖ్యంగా చేపలు, ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, నట్స్‌, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవటం వలన క్రమంగా అరికాళ్ళ మంటలు తగ్గుతాయి.


- వ్యాయామాలు, మసాజ్‌ వాకింగ్‌, జాగింగ్‌, పరిగెత్తటం వంటి రెగ్యులర్‌ వ్యాయామాలు ఖ‌చ్చితంగా చేయటం వల్ల‌ కాళ్ళ మంటలు తగ్గుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: