పొట్ట దగ్గర కొవ్వు కరగాలి అంటే ఈ సూచనలు పాటిస్తే చాలు !

Seetha Sailaja
ప్రస్తుతం మనదేశ జనాభాలో చాలామంది కొవ్వుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి అనేక కారాణాలు ఉన్నట్లే ఆ కొవ్వును కరిగించుకునే మార్గాలు కూడ చాల ఉన్నాయి.

ఇలా పొట్టచుట్టూ ఎక్కువ కొవ్వు పేరుకు పోవడం వలన అనేక అనారోగ్య సమస్యలతో పాటు మన ఫిజిక్ కూడ బాగా దెబ్బతింటుంది. మంచి రూపు కలిగి ఉండటం ప్రస్తుతం చాల అవసరమైన నేపధ్యంలో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. ఇలాంటి పరుస్తుతులలో ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే కొంతవరకు మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును చాల వరకు తగ్గించుకునే ఆస్కారం ఉంది. 

మనం నిరంతరం తినే ఆహార పదార్ధాలతో పాటు కరివేపాకు ఆకుల పేస్ట్ ను మజ్జిగలో కలుపుకుని తాగితే మన పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు కరిగిపోయే ఆస్కారం ఉంది. 
అదేవిధంగా ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ వీటి పొడిని మిశ్రమంగా చేసుకుని చూర్ణంగా మార్చి ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని త్రాగితే మన పొట్టపై ఉన్న కొవ్వు ఖచ్చితంగా కరిగిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.  

అదేవిధంగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో సోంపు కలుపుకుని నీటితో సహా సోంపును తాగుతూ నమిలి మింగిన వారికి జీర్ణక్రియ సక్రమంగా జరిగి పోట్టదగ్గర పేరుకు పోయిన కొవ్వు తగ్గుతుందని చెపుతున్నారు. దీనికితోడు ఒక టీ స్పూన్ మెంతుల పొడిని గోరు వెచ్చని నీళ్ళల్లో కలుపుకుని త్రాగిన వారికి కాలేయం చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. అంతేకాకుండా దాల్చిన చెక్క పొడిని బాగా మరగ పెట్టిన నీళ్ళల్లో మరిగించి ఆ తరువాత ఆనీటిని వదపోసుకుని త్రాగిన వారికి అసలు పొట్ట దగ్గర కొవ్వు అన్నదే ఏర్పడదు అని అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి. ఈ చిట్కాలలో ఎవరికి వీలైన హెల్త్ టిప్పును వారు అనుసరిస్తే పొట్ట దగ్గర ఏర్పడే కొవ్వు సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: