డయాబెటీస్ ను నియంత్రించే పన్నీర్ !

Seetha Sailaja
మనదేశంలో శాఖాహారులు మాంసాహారులు సమానంగా ఇష్టపడే పన్నీర్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పాలనుంచి తయారయ్యే పన్నీర్ లో అనేక పోషకాలుండి మనశరీర ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది.  కొంతమందైతే పన్నీర్ ను పచ్చిగానే తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు.  ఎన్నో పోషక విలువలున్న పన్నీర్ భారతీయ వంటకాలలో భాగమైపోయింది. 

పన్నీర్ నిత్యం తీసుకునే వారికి హృద్రోగాలు వచ్చే అవకాశాలు తగ్గి రక్తపోటు లిపిడ్ శాతాలు కూడా అదుపులో ఉంటాయి. పన్నీర్ లోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. అదేవిధంగా పన్నీర్ లోని పీచుపదార్థం జీవక్రియను పెంచి బరువు తగ్గటంలో సాయపడుతుంది. పన్నీర్ లో ఉండే కాల్షియం ఫాస్పరస్ ఎముకల రోగాలను పళ్ళ సమస్యలను పోగొట్టి వాటిని గట్టిపరుస్తుంది. 

పనీర్లో ఎక్కువగా ఉండే ప్రొటీన్ పిల్లలకు పోషకాలందించి వారి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పిల్లలలో కణజాల ఉత్పత్తి అవి బలంగా మారటానికి పనీర్ ఉపయోగపడుతుంది. భారీ వ్యాయామాలు చేసిన వెంటనే పనీర్ తింటే వెనువెంటనే శక్తి ఓపిక వస్తుంది. పనీర్లోని మంచి ప్రొటీన్ కడుపు బ్రెస్ట్ ప్రొస్టేట్ క్యాన్సర్ల వంటి వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. 

పన్నీర్ ను తమ ఆహార పదార్ధాలలో తరుచూ తీసుకునే వారికి డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోం గ్లూకోజ్ ఇన్ టోలరెన్స్ వంటి స్థితులు రాకుండా చేస్తుంది. గర్భవతులు పన్నీర్ తీసుకోవడం వలన వారికి కలిగే వికారం రక్తహీనత వంటివి రాకుండా ఉంచుతుంది. అంతేకాదు మన శరీరంలో పన్నీర్ కొత్తకణాలను పుట్టించి శరీరాన్ని వృద్ధాప్య ఛాయలకు పోకుండా వయస్సుకి తగ్గట్టుగా బిగువుగా ఉండేట్లు చేస్తుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్న పన్నీరు వీలైనంత వరకు మనం తీసుకునే ఆహార పదార్ధాలలో ఉపయోగించుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అని వైద్యులు కూడ చెపుతున్నారు..  
;


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: