రేగి పండ్లలో ఆరోగ్యం !
ఈ సంక్రాంతి సీజన్ లో పులుపు, తీపి రుచుల కలయికతో ఉండే రేగుపండ్లు మనకు ఎక్కువగా దొరుకుతాయి. ఈరేగు పండ్లతో చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోయడమే కాకుండా ఈ రేగుపండ్లలో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుంటే ఎవరు ఈపండ్లను తినకుండా ఉండలేరు. ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే ఈ రేగుపండ్లు మన దేశంలో అనేక ప్రాంతాల్లో లభిస్తాయి.
ఈ రేగుపండ్లలో 40 జాతులకు పైగా
ఉన్నాయి. పసుపు, కాఫీ రంగులు కలిసి, ఎరుపు లేదా బ్రిక్ రెడ్, గ్రీన్ తదితర రంగుల్లో ఇవి మనకు లభిస్తాయి. ఇక కొన్ని రేగు పండ్లు
పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. మరి కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఈ పండ్లు తినడం వల్ల
కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రేగు పండ్లలో వివిధ రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. సి విటమిన్
వీటిలో ఎక్కువగా ఉంటుంది. జామకాయ తరువాత ఈ విటమిన్ వీటిలోనే ఎక్కువగా ఉంటుంది అని
పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
ఈ పండ్లకు కడుపులో మంటను తగ్గించే గుణం ఉండటమే కాకుండా అజీర్తికి బాగా పనిచేస్తాయి. గొంతు నొప్పి, ఆస్తమా, కండరాల నొప్పులను ఇవి తగ్గిస్తాయి. రేగు పండ్ల గింజలను పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈరేగు పండ్లలో ఉండే గ్లుంటామిక్ యాసిడ్ మెదడు బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. జ్వరం, జలుబు రాకుండా ఉండాలంటే తరచూ రేగు పండ్లను తినాలి అంటారు.
బరువు పెరిగేందుకు కండరాలకు బలాన్నివ్వడంతో
పాటు శరీరానికి శక్తినిచ్చేందుకు రేగు పండ్లు చక్కగా ఉపయోగపడతాయి. శరీరంలో రోగ నిరోధక
శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఈరేగి పండ్లలో
ఉన్నాయి. రక్తాన్ని శుద్ధి చేసెందుకు జీర్ణశక్తిని పెంపొందించెందుకు ఈ రేగు పండ్లు
ఎంతగానో ఉపయోగ పడతాయని ఆయుర్వేద పరిశోధనలు తెలియచేస్తున్నాయి..