భార్యా - బిడ్డలు అక్కడే ఉన్నారు .. వారి ముందే మరో మగాడిని పెళ్లి చేసుకున్నాడు

KSK

వారిద్దరూ మగవాళ్ళు .. పెళ్ళికి సిద్ధం అయ్యారు .. నుదిటిన బాసికం కట్టుకున్నారు .. పైగా వాళ్ళు బ్యాచిలర్ లు కాదు సుమా . ఇద్దరికీ ఎప్పుడో పెళ్లి అయ్యింది , ఎవరికి ఇద్దరేసి చొప్పున పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యా పిల్లలు చూస్తూ ఉండగానే ఇద్దరు మగవాళ్ళు వివాహం చేసుకున్నారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో రమేష్ సింగ్ తోమార్ దగ్గర సక్రాం ఆసీర్వర్ , రాకేశ్‌ అద్జన్‌ లు పని చేస్తున్నారు.


సకాలంలో వర్షాలు పడకపోవడంతో వరుణదేవుడు అనుగ్రహించాలంటూ కప్పలు, కుక్కలకు పెళ్లిళ్లు చేసినా ఫలితం లేకపోవడంతో లోకకల్యాణార్థమై వర్షాలు కురవాలంటూ సక్రామ్, రాకేష్ లు వివాహం చేసుకున్నారు. చుట్టుపక్కల ఊర్ల నుంచి ఈ మగవారి పెళ్లి చూడడం కోసం జనం తండోప తండాలు గా ఎగబడ్డారు.


పెళ్లి తంతు ముగిసిన తరవాత ఇప్పటి వరకూ వర్షం పడలేదు. పెళ్లి పూర్తి అవ్వగానే ఎవరి భార్యని వాళ్ళు తీసుకుని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు.


శాస్త్ర పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మూర్ఖపు ఆచారాలు ఏంటి అంటూ చదువుకున్నవాళ్ళు మండి పడుతున్నారు. కాగా, పెళ్లితంతు సమయంలో మబ్బులు పట్టిన ఆశాకం చినుకు చుక్క రాల్చకుండానే ఆశలు అడియాశలు చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: