షుగర్ వ్యాధిని దరి చేరనేయని ఆగాకరకాయ !

Seetha Sailaja
ఆగాక‌ర‌ కాయకు చాలా పేర్లు ఉన్నాయి  దీనిని  అడ‌వి కాక‌ర‌, బొంతు కాక‌ర‌, బోడ కాక‌ర‌ అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాము కాక‌ర‌కాయంత పొడ‌వుగా ఉండకుండా  దానంత చేదు కూడా ఉండకుండా ఈ కూరలో అనేక పోష‌కాలు ఉన్నాయి.  దీనిని మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు పొందవచ్చని  పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఆగాక‌ర కాయ‌లు మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. 

ఇవి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. మ‌ధుమేహం వ‌ల్ల వ‌చ్చే ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి.  దీనితో షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ కాకరకాయను తరుచు చాల ఎక్కువగా తీసుకోవడం మంచిది అని వైద్యులు చెపుతున్నారు.  

ఆగాక‌ర కాయ‌ల్లో పైటో న్యూట్రియంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌ ను తగ్గించడానికి ఎంతో సహాయ పడటమే కాకుండా క్యాన్స‌ర్ క‌ణాల‌ను  పెరగ నీయకుండ చేసే గుణం ఇందులో ఉంది.   ఆగాకాకరకాయలో చిన్న పిల్ల‌ల‌కు, గ‌ర్భిణీ స్త్రీలకు ఎంత‌గానో అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాలు ఉన్నాయి. 

ఆగాక‌ర కాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. ఆగాక‌ర కాయ‌ల్లో ఫ్లేవ‌నాయిడ్లు కూడా స‌మృద్ధిగానే ఉంటాయి అని పరిశోధనలు చెపుతున్నాయి. ఇది యాంటీ ఏజింగ్ గుణాల‌ను క‌లిగి ఉండటంతో వృద్ధాప్య ఛాయ‌లు కాని శరీరం ముడతలు పడటం కాని ఉండదు అని అంటారు.

అంతేకాదు ఆగాక‌ర‌లో విట‌మిన్ ఎ కూడా సమృద్ధిగా ఉంటుంది అని చెపుతున్నారు వైద్యులు. దీని వలన  కంటి చూపు వ్యాధులు తొల‌గిపోతాయి.  మూత్ర‌పిండాలు, మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిత్యం ఆగాక‌ర కాయ‌ల‌ను తింటే ఆ స‌మ‌స్య‌ల నుండి విముక్తి పొందవచ్చని నెచురోపతి వైద్యులు చెపుతున్నారు.

మన జీర్ణ‌వ్య‌వ‌స్థను మెరుగు పరచడంలో ఈ ఆగాకాకరకాయ ఎంతో మేలు చేయడమే కాకుండా  గ్యాస్‌ - అసిడిటీ – అజీర్ణం - మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు అని డాక్టర్స్ చెపుతున్నారు అంటే ఈ ఆగాకాకరకాయలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: