రోగ నిరోధక శక్తి కోసం నేరేడు పండు !

frame రోగ నిరోధక శక్తి కోసం నేరేడు పండు !

Seetha Sailaja
ఆయుర్వేద వైద్యులు ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లలో నేరేడు పండుకు ఉన్న ప్రాముఖ్యతను బాగా తెలియ చెపుతున్నారు. మన శరీరంలోని అనేక రుగ్మతలను తగ్గించే శక్తి నేరేడు పండుకు ఉన్న నేపధ్యంలో ఈ పండ్ల వాడకాన్ని చాలామంది ఆయుర్వేద వైద్యులు ప్రోత్సహిస్తున్నారు. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు పండులో ఉంది. ఒక్క పండే కాదు నేరేడు ఆకులు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 

ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో పుష్కలంగా ఉన్నాయి. నేరేడులో ఉన్న అనేక ప్రయోజనాలు వల్ల ఆరోగ్య ఫలప్రధాయినిఈ నేరేడు పండును గుర్తిస్తున్నారు. ఈ పండ్లను ఎక్కువగా తింటే గుండె జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు.  ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యల నుండి రక్షణ పొందవచ్చు. 

ఈ పండ్లను బాగా తినే వారికి పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. ఈ పండ్లను వేసవిలో తీసుకున్న వారికి వేడి వాతవరణం నుండి శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. అంతేకాదు స్కిన్ రాషెష్ నుండి కూడ రక్షించి మన స్కిన్ ను కాపాడుతుంది ఈ నేరేడు పండు. నేరుడు గింజలను పౌడర్ చేసి, ఆపౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలను నివారించబడుతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్దాప్యము ఆలస్యంగా వస్తుంది. 

నేరుడు పండ్లు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంటుగా పనిచేయడమే కాక, రోగనిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడతాయి. వీటిలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్స్ సి శరీరానికి బాగా శక్తిని కలిగిస్తాయి. ఈమధ్య అన్నామలై యూనివర్సిటి విద్యార్ధులు చేసిన అధ్యయనం ప్రకారం ఈ నేరుడు పండ్లు శరీరంలో హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుందని వారి అధ్యయనంలో సరికొత్త విషయాలు బయట పడ్డాయి. అంతేకాదు నేరేడు పండ్ల జ్యూస్ ను తేనె, ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది అని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ నేరేడు పండును తీసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: