శరీరానికి పోషకాలను అందించే మొలకెత్తిన పెసలు !

Seetha Sailaja
మొలకెత్తిన పెసలను ప్రతిరోజు తినడం వల్ల మన శరీరానికి వాటి వల్ల అందే పోషకాలను తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యమైన ఆహార పదార్థాల్లో పెసలు కూడా ఒకటి. పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసలలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. దీనితో పాటు ఫైబర్ వీటిలో అధికంగా ఉంటుంది. పెసలను మొలకెత్తిన గింజల రూపంలో నిత్యం తీసుకుంటే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రకృతి వైద్యులు చెపుతారు. 

మొలకెత్తిన పెసలలో అధికంగా ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గించేందుకు, కొవ్వును కరిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను నిర్మూలించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని తీసుకున్న తరువాత ఎక్కువగా ఆకలి వేయదు. దానివల్ల మన శరీర బరువు తగ్గడమే కాకుండా మలబద్దకం కూడా తొలగిపోతుంది. 

మన శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి. అదేవిధంగా విటమిన్ ఎ, బి, సి, డి, ఇ, కెలు, థయామిన్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ బి6, ఫాంటోథెనిక్ యాసిడ్‌లు వీటిలో ఎక్కువగానే ఉన్నాయి. మొలకెత్తిన పెసలు తీసుకోవడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. గుండె జబ్బులు రాకుండా నిరోధించబడతాయి. రక్తహీనత తొలగిపోవడంతోపాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అని చెపుతారు ప్రకృతి వైద్యులు. 

మన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మొలకెత్తిన పెసలకు ఉంది. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పెసలలో ఉన్నాయి. అంతేకాకుండా పలురకాల క్యాన్సర్లను అడ్డుకునే కారకాలు పెసలలో ఉన్నాయి. గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మొలకెత్తిన పెసలను నిత్యం తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అందడమే కాకుండా మన శరీరం ఎటువంటి వ్యాధులకు భారిన పడకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ పెసలు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: