డయాబెటిక్ పేషంట్స్ కు హెల్దీ జ్యూసులు !

Seetha Sailaja
డయాబెటిక్ పేషంట్స్ అనగానే వారు తినే పదార్ధాల విషయంలో అనేక నియంత్రణలు పాటించవలసి వస్తుంది. ఆ నియంత్రణలో ఏ మాత్రం తేడా వచ్చినా అనేక రకరకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ పేషంట్లు నోరు తీపి చేసుకేనే అవకాశం ఉన్న కొన్ని హెల్దీ జ్యూస్ ల వివరాల గురించి తెలుసుకుందాం.

వాటిలో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి క్యారెట్, దోసకాయ, కాకరకాయ, టొమాటో జ్యూస్ లను చెప్పుకోవచ్చు. ఈ జ్యూస్ లు తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ముఖ్యంగా దోసకాయ, టొమాటొ జ్యూసులు యూరిన్  లో షుగర్ ని తగ్గిస్తాయి. ఇక బొప్పాయి జ్యూస్ తీసుకుంటే ఇది మన శరీరాన్ని రోజంతా ఉత్సాహబరితంగా ఉంచడమే కాకుండా మనలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి సహకరిస్తుంది. 

ఇవే కాకుండా సగం క్యాప్సికమ్, సగం కాకరకాయ, సగం దోసకాయ, సగం గ్రీన్ యాపిల్ తో కలిపి మిక్సేడ్ ఫ్ఫ్రూట్ షేక్ గా మార్చుకుంటే చాల రుచిగా ఉండటమే కాకుండా ఇందులో ఉండే పోషకాల వల్ల మన శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గుతాయి.  

ప్రస్తుతo మనదేశ జనాభాలో దాదాపు 40 శాతం మంది షుగర్ వ్యాధితో బాధ పడుతున్న నేపధ్యంతో పాటు ఈవ్యాధి వల్ల తలెత్తుతున్న అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా పైన పేర్కొన్న బడ్డ జ్యూస్ లను మనం క్రమం తప్పకుండా తీసుకోగలిగితే ఎంతో కొంత మేలు జరుగుతుంది అన్న వాస్తవాన్ని పరిశోధనలు కూడ అంగీకరిస్తున్న నేపధ్యంలో ఈ జ్యూసుల ద్వారా షుగర్ వ్యాధిగ్రస్తులు బయటపడే ఆస్కారం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: