రోజు ఇది తింటే ఏ రోగం రాదు?

Purushottham Vinay
జొన్న పిండితో చేసే అంబలి చాలా సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారమనే చెప్పవచ్చు. ఈ అంబలిని ప్రతి రోజు తాగడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది.దీన్ని తాగడం వల్ల మన శరీరానికి చలువ చేస్తుంది. ఇంకా అలాగే శరీరానికి కావల్సిన చాలా ముఖ్యమైన పోషకాలు ఈజీగా అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ అంబలిని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇక ఎవరైనా ఈ అంబలిని చాలా సులభంగా తయారు చేసుకోని తాగవాచ్చు.ఈ జొన్న అంబలి తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకోని ఆ తరువాత ఇందులో 2 కప్పుల నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి.ఆ తరువాత మరో గిన్నెలో 5 కప్పుల నీళ్లు పోసి కాసేపు వేడి చేయాలి. ఆ నీళ్లు మరిగిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని మీరు వేసుకోవాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడికించుకోవాలి.


ఇలా ఒక 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి కలుపుతూ చల్లారనివ్వాలి. ఆ తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా కూడా పులియబెట్టాలి. ఇక మట్టి పాత్రలు అందుబాటులో ఉన్న వారు ఈ అంబలిని మట్టిపాత్రలో పోసి కాసేపు పులియబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా కూడా పులిసిన తరువాత అంబలి గట్టిగా తయారవుతుంది.తరువాత దీనిని మరోసారి ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత మజ్జిగ పోసి కలపాలి.ఆ తరువాత ఉప్పు వేసి కలపాలి.ఇప్పుడు ఈ అంబలిని గ్లాస్ లో పోసి ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చితో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే జొన్న అంబలి తయారవుతుంది.మీరు వేసవికాలంలో దీనిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఇంకా ఎండ వల్ల కలిగే నీరసం బారిన పడకుండా ఉంటాము. ఈ అంబలిని తాగడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఈ వేసవికాలంలో ఇలా జొన్న పిండితో అంబలిని తయారు చేసుకుని తాగడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: