బొద్దింకలకు నాచురల్ హిట్ తో పారద్రోలండీ..!

Divya
చాలామంది ఇళ్లల్లో చూసిన బొద్దింకలు పరిగెడుతూనే ఉంటాయి.అవి గిన్నెలు,ప్లేట్స్ పై అటుఇటు తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తే మాత్రం అన్నం తినాలని కూడా అనిపించదు.ఇంక ఎవరైనా బంధువులు వస్తే సరే సరి. అంతేకాక బొద్దింకలు తిరిగిన వస్తువులను తిరిగి వాడుకోవడం వల్ల జీర్ణ సంబంధిత రోగాల బారిన పడాల్సిందే.అంతే కాక ఇవి ఫంగస్ వ్యాధులను కూడా వ్యాప్తి చెందిస్తాయి.కావున వాటి భారీ నుండి తప్పించుకోవడానికి కరంగా కెమికల్ హిట్లను వాడుతూ ఉంటాము.వాటితో బొద్దింకలు పోకపోగా,అవి బ్రీతింగ్ ఎలర్జీలను కలిగిస్తూ ఉంటాయి.ఇలాంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవడానికి న్యాచురల్ గా దొరికే కొన్ని పదార్థాలతో హిట్ తయారు చేసుకోవడం చాలా ఉత్తమం.మరియు బొద్దింకలను కూడా దెబ్బకు పారిపోయేలా చేయవచ్చు.అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వేపాకు హిట్..
దీనికోసం వేపాకును తీసుకొని బాగా ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి.దీనిని రాత్రి పడుకోబోయే ముందు బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో చల్లాలి.వేపాకుకు ఉన్న చేదు వాసన వల్ల బొద్దింకలు పారిపోతాయి.వేపనూనెను చల్లినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
లవంగాల పొడి..
దీనికోసం గుప్పెడు లవంగాలను తీసుకొని పొడిలా చేసి, వేపనూనెతో కలిపి ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి. ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో స్ప్రే చేయడం వల్ల లవంగాలకు ఉన్న ఘాటు వల్ల  బొద్దింకలు పారిపోతాయి.

బేకింగ్ సోడా..
రెండు చెంచాల బేకింగ్ సోడాకి మూడు స్పూన్ల చక్కెరను కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలి.ఇందులో తగినన్ని నీరు పోసి బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో స్ప్రే చేయాలి.అవి చక్కెర వాసనకు తినడానికి వచ్చి బేకింగ్ సోడాను కూడా తింటాయి.సాధారణంగా బేకింగ్ సోడా తినడం వల్ల బొద్దింకలు నాశనం అవుతాయి.
బే లీవ్స్..
గుప్పెడు బేలీవ్స్ తీసుకొని,మూడు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి.ఆ తరువాత బొద్దింకలపై స్ప్రే చేయడం వల్ల ఆ ఘాటు వాసనకి బొద్దింకలు పారిపోతాయి.
ఇవేకాక కిచెన్ ని క్లీన్ గా పెట్టుకోవడం,చెత్తను ఎప్పటికప్పుడు పడేయడం వంటివి చేయడం వల్ల,బోద్దింకలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: