బెండకాయతో ఎన్ని అద్భుత ప్రయోజనాలో తెలుసా?

Purushottham Vinay
ఆరోగ్య నిపుణులు అనేక రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని వెల్లడించారు. ఇక డయాబెటిస్ తో పోరాడేందుకు బెండకాయ లేదా ఒక్రా చాలా అద్భుతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల బెండకాయలో 35 కేలరీలు ఇంకా 1.3 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలాగే విటమిన్ బి6, ఫోలేట్ వంటి అవసరమైన విటమిన్లతో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇంకా ఇది జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది.ఇక మధుమేహం ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన ఆహార ఎంపికగా మారుతుంది. కరిగే ఫైబర్ చక్కెర స్థాయిలని ఈజీగా అదుపులో ఉంచుతుంది.ఇంకా అంతే కాదు ఈ కూరగాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.అలాగే ఆహారం నుంచి విడుదలయ్యే చక్కెరని ఆలస్యంగా జీర్ణం చేస్తాయి. మధుమేహం జబ్బు ఉన్నవారిలో ఉండే మరొక సమస్య బరువు పెరగడం. దీన్ని కూడా బెండకాయ ఈజీగా అదుపులో ఉంచుతుంది.


అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత చాలా సేపు మీకు ఆకలిగా అనిపించదు. అతిగా తినడాన్ని కూడా ఈజీగా నివారిస్తుంది.అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడానికి బెండకాయ ఒక కొత్త అద్భుతమైన కూరగాయ.ఇంకా అలాగే బెండకాయ  మలబద్ధకం,ఇర్రీటబుల్ బోవెల్ సిండ్రోమ్ నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది.అలాగే ఇది కొలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా ఈజీగా తగ్గిస్తుంది.ఇక ఇందులోని పెక్టిన్ అనే ఎంజైమ్ చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడంలో చాలా మెరుగైన పాత్ర పోషిస్తుంది.అలాగే బెండకాయ గింజలు యాంటీ స్ట్రెస్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఇది రక్తహీనత నుంచి బయటపడేస్తుంది. ఇంకా అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇంకా నిద్రకి అవసరమయ్యే సెరోటోనిన్, మేలాటోనిన్ ని కూడా ఈజీగా నియంత్రిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: