అధిక రక్తపోటుని తగ్గించే ఆహార పదార్ధాలు ఇవే?

Purushottham Vinay
మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఒత్తిడి, ఆందోళన, అధిక బరువు ఇంకా ఉప్పు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. వయసుతో సంబంధం లేకుండా నేటి కాలంలో ఈ సమస్య అందరిని వేధిస్తుంది. తలనొప్పి, చూపు సరిగ్గా కనిపించకపోవడం, వికారం, తల తిరిగినట్టుగా ఉండడం, ఛాతిలో నొప్పి ఇంకా శ్వాస ఆడనట్టుగా ఉండడం వంటి వాటిని అధిక రక్తపోటు అనేవి లక్షణాలుగా చెప్పవచ్చు. అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు వల్ల గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గుండె పోటు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.మందులు వాడడంతో పాటు కొన్ని రకాల ఆహార పద్ధతులని పాటించడం వల్ల కూడా మనం చాలా సులభంగా అధిక రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడే వారు పొటాషియం, క్యాల్షియం ఇంకా మెగ్నీషియం వంటిపోషకాలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.ఖచ్చితంగా సోడియం కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. ఒక రోజుకు ఒక టీ స్పూన్ కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఇంకా అలాగే బేకరీ పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, సోడాలు ఇంకా రెడీ టు ఇట్ ఫుడ్ ఐటమ్స్ ను మాత్రం తక్కువగా తీసుకోవాలి. వీటికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. అధిక రక్తపోటుతో బాధపడే వారు పొటాషియం, క్యాల్షియం ఇంకా మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.ఇవి అధిక రక్తపోటును నియంత్రించడంలో చాలా చాలా బాగా సహాయపడతాయి. ఈ మినరల్స్ ఎక్కువగా బీన్స్, పాలు, పెరుగు, బెర్రీస్, కొబ్బరి నీళ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, చియా సీడ్స్ ఇంకా గుమ్మడి గింజలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి.ఇంకా అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. దీని వల్ల గుండె ఆరోగ్యం అనేది దెబ్బతినకుండా ఉంటుంది.అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక రక్తపోటును అదుపులో ఉంచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటుతో బాధపడే వారు ముఖ్యంగా అరటి పండును ఖచ్చితంగా తినాలి.ఎందుకంటే దీనిలో అధికంగా ఉండే పొటాషియం ఇంకా మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: