పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు ఖచ్చితంగా కరిగే టిప్?

Purushottham Vinay
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గుండెపోటు, రక్తపోటు ఇంకా షుగర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక బరువును అలాగే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఎంత త్వరగా తొలగించుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయినా కూడా ఎలాంటి ఫలితం లేక మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే ఈ టిప్ ని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఈ టిప్ ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం ఉపయోగించాల్సిన ఒకే ఒక పదార్థం చియా విత్తనాలు. ఇవి మనందరికి అందుబాటులో ఉండేవే. చియా విత్తనాలు మనకు సూపర్ మార్కెట్ లో, అన్ లైన్ లో చాలా ఈజీగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అధిక బరువు, హైపో థైరాయిడిజం ఇంకా షుగర్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ చియా విత్తనాలను వేసి అర గంట నుండి ఒక గంట పాటు నానబెట్టి ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.


ఇక ఇలా నీటిని తాగుతూ చియా విత్తనాలను తినడం వల్ల చాలా ఈజీగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఈ విత్తనాల్లో చాలా ఎక్కువగా ఉండే ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో బాగా సహాయపడతాయి. ఇలా చియా విత్తనాలను తీసుకుంటూనే జంక్ ఫుడ్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఒక అరగంట పాటు వ్యాయామం చేయాలి. మంచి జీవన విధానాన్ని ఖచ్చితంగా పాటించాలి. పొట్ట చాలా ఎక్కువగా ఉన్న వారు ఈ విత్తనాలను రెండు పూటలా తీసుకోవచ్చు. ఉదయం పూట అల్పాహారాన్ని అరగంట ముందు అలాగే రాత్రి భోజనం చేసిన రెండు గంటల తరువాత వీటిని తీసుకోవచ్చు. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు తక్కువగా ఉన్న వారు ఉదయం పూట తీసుకుంటే సరిపోతుంది. ఇలా చియా విత్తనాలను తీసుకోవడం వల్ల చాలా ఈజీగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఇంకా అలాగే అధిక బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: