వడదెబ్బ తగిలితే ఇలా చేయండి..!!

Divya
ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ఎండలు చాలా తీవ్రంగా నమోదవుతున్నాయి. సూర్యుడు వేడికి ప్రజలు కూడా బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ప్రజలు వీలైనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. అవసరమైతేనే తప్ప బయటకి రాకూడదని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీచేస్తోంది. అయితే అలా బయటికి రావాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలని తెలియజేస్తున్నారు వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

ఎండలో బయటికి వచ్చేవారికి ఎక్కువగా వడదెబ్బకు గురవుతున్నారు ..అయితే వడ దెబ్బ తగిలితే ఏం చేయాలి అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ముఖ్యంగా వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి వడదెబ్బ అంటే ఏంటో తెలియకపోవచ్చు..ఎవరైనా సరే నీరసంగా కనిపిస్తే కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనుకుంటారు కానీ పొరపాటున కూడా వడదెబ్బ తగిలిన తర్వాత ఆ వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
1). లక్షణాలు:
వడదెబ్బ తగిలిన వ్యక్తికి శరీరంలో ఉష్ణోగ్రత హమాంతం పెరిగిపోతుంది అలాగే వాంతులు నీరసం శరీరం పొడిబారి పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా కండరాలలో తిమ్మిరి అధికంగా చెమటలు పట్టడం వంటివి జరుగుతూ ఉంటాయట.
2). చేయవలసిన పనులు
వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెంటనే నీడకు చేర్చడం చాలా మంచిది. శరీరానికి బాగా గాలి తగిలే ప్రాంతంలో ఆ వ్యక్తిని ఉంచాలి.. ఆ తర్వాత చల్లని నీటిలో బట్టలు తడిపి శరీరమంతా బాగా తుడచాలి.. ఆ తర్వాత ఉప్పు కలిపిన నీటిని లేకపోతే మజ్జిగ వంటివి కాపాడం చాలా మంచిది.

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందువలన బయటకి వెళ్లకపోవడమే చాలా మంచిదని వాతావరణ నిపుణులతో పాటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అధిక మొత్తంలో నీటిని తాగడం వల్ల ఈ వడదెబ్బ వారి నుండి తప్పించుకోవచ్చు. మనం ప్రతిరోజు తాగేటువంటి నీటి కంటే అధిక మొత్తంలో తాగడం వల్ల ఈ ఎండల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: