మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనడానికి సూచనలు ఏంటో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో ఉన్న ఆహార అలవాట్లు,జీవన శైలి మరియు తగిన వ్యాయామం లేకపోవడం వల్ల రకరకాల వ్యాధులను కొని తెచ్చుకుంటూన్నాము.అలాంటి వ్యాధులు కొన్ని రకాల టెస్ట్ చేయించుకుంటే మాత్రమే బయటపడతాయి.కానీ అలాంటి టెస్ట్లతో పని లేకుండా మన శరీరం ఇచ్చే కొన్ని సూచనల వల్లే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
అరగంటలో నిద్ర..
చాలామంది నిద్ర ఉపక్రమించిన తర్వాత రెండు,మూడు గంటల సేపైనా కూడా నిద్ర పట్టక,నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు.మరికొంతమంది నిద్రకు ఉపక్రమించిన అరగంటలోపే నిద్రలోకి జారుకుంటారు. అరగంటలోపే నిద్రపోయేవారు చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అని వైద్యనిపుణులు చెబుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారు కచ్చితంగా శరీర పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని హెచ్చరిస్తున్నారు.
పీరియడ్స్..
మహిళల్లో పీరియడ్స్ సకాలంలో వస్తూఉంటే వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేసినట్టే.కావున ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచిస్తున్నారు.రుతుక్రమణ సమయంలో ఏదైనా సమస్యలు ఉంటే  వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.
అలసట..
రోజువారి పనులు సక్రమంగా,అలసట లేకుండా,ఉత్సాహం తో చేసుకున్నట్లయితే వారు ఆరోగ్యంగా ఉన్నట్టే.కానీ కొంతమందిలో ఏ చిన్న పని చేసినా అలసటగా కనిపిస్తూ ఉంటారు.అలా నిస్సత్తుగా ఉన్నప్పుడు వైద్యుల్ని సంప్రదించి,తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది.
జ్ఞాపకశక్తి..
జ్ఞాపకశక్తి సక్రమంగా ఉన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉన్నట్టు.చాలా మంది చిన్న చిన్న విషయాలను తొందరగా మర్చిపోతూ వుంటారు.అలా మర్చిపోకుండా షార్ట్ టర్మ్ మెమరీ,లాంగ్ టర్మ్ మెమొరీలు సక్రమంగా గుర్తు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం అని వైద్య నిపుణులు  సూచిస్తున్నారు.
ముత్రానికి సక్రమంగా వెళ్లడం..
ప్రతి ఒక్కరూ మలముత్రాలకు సక్రమంగా వెళుతున్నట్లయితే,మన జీర్ణవ్యవస్థ మరియు కిడ్నీ పనితీరు ఆరోగ్యంగా ఉన్నట్టు.మల ముత్రాలు తరచూ రాకపోతే వైద్యం సంప్రదించడం చాలా ముఖ్యం.
చర్మం..
మన చర్మం,జుట్టు మృదువుగా,కాంతివంతంగా ఉన్నట్టయితే మనం ఆరోగ్యకరంగా ఉన్నట్టే.కావున మన శరీరం ఇచ్చే,ఈ సూచనలన్ని గమనించుకున్నట్లయితే, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: