రక్తహీనతని పూర్తిగా తగ్గించే న్యాచురల్ టిప్?

Purushottham Vinay
రక్తహీనత అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి బయట పడటం కోసం చాలా మంది కూడా అనేక రకాల మందులు వాడుతున్నారు.అయితే అలా మందులకి బదులు మీరు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే లడ్డూను డైట్ లో చేర్చుకుంటే న్యాచురల్ గా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. ఇక ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తీసుకుంటే రక్తహీనత సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఫస్ట్ ఒక కప్పు బాదం,ఒక కప్పు వాల్ నట్స్ ఇంకా ఒక కప్పు జీడిపప్పు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.ఇక ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పులు గింజ తొలగించిన ఖర్జూరంని వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. ఇక ఆ నెయ్యి హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న బాదం, వాల్ నట్స్, జీడిపప్పు పలుకులని అందులో వేసుకోవాలి.


 ఇక ఇది కాస్త దోరగా వేగిన తర్వాత పదిహేను ఎండు ద్రాక్ష, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్, ఇంకా అరకప్పు కొబ్బరి పొడిని వేసి వేయించుకోవాలి. ఇక చివరిగా ఖర్జూరం పేస్ట్ కూడా వేసి బాగా కలిపి స్టౌని ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూల లాగా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ నట్స్ లడ్డూను రోజుకొకటి చొప్పున ప్రతి రోజు కనుక తింటే శరీరానికి అవసరం అయ్యే ఐరన్ చాలా సమృద్ధిగా లభిస్తుంది. దాంతో హిమోగ్లోబిన్ శాతం కూడా బాగా పెరిగి రక్తహీనత సమస్య చాలా ఈజీగా దూరం అవుతుంది.రెగ్యులర్ గా ఈ లడ్డూను కనుక తీసుకుంటే రక్తహీనతకు చాలా ఈజీగా దూరంగా ఉండొచ్చు. అలాగే ఈ లడ్డూను తీసుకోవడం వల్ల నీరసం ఇంకా అలసట వంటివి చాలా ఈజీగా దూరం అవుతాయి.మన బాడీ కూడా చాలా ఎనర్జిటిక్ గా  మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: