సీజన్ మార్పు వల్ల కలిగే దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా..!

Divya
కొంతమందికి సీజన్ లో మార్పు వచ్చినా సరే అలెర్జీలు వస్తుంటాయి. దానితో దగ్గు,జలుబు వచ్చి ఎన్నిరోజులకూ తగ్గక, తెగ బాధపడుతుంటారు.దానికోసం ఎన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా ప్రయోజనం లేక ఇబ్బంది పడుతుంటారు . మరియు ఇంకొంతమందిలో తాగే నీటిలో కూడా మార్పు వచ్చినా సరే ఇన్ఫెక్షన్ కలుగుతుంది.విటన్నిటింటికి కారణమైన బ్యాక్టిరియా, వైరస్ లు అంటూ వ్యాధులు కూడా కలిగిస్తున్నాయి.వీటిని నివారించడానికి ఇంగ్లీష్ మందుల కన్నా,బామ్మలు చెప్పే చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి.అంతేకాక ఆ చిట్కాలు పాటించడం వల్ల,రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. తీవ్రమైన దగ్గు, జలుబు వున్నపుడు రెండు టీస్పూన్ల తేనె, రెండు టీ స్ఫూన్ల నిమ్మరసం తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, దగ్గు జలుబు తొందరగా తగ్గడానికి దోహదపడతాయి.

2. తులసి ఆకులు బ్యాక్టీరియా లక్షణాలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. తులసి ఆకుల కషాయం కోసం, గుప్పెడు తులసి ఆకులు తీసుకుని, గ్లాస్ నీళ్లలో వేసి బాగా మరిగించి, అందులో తేనె నిమ్మరసం కలిపి, నెమ్మదిగా తాగుతూ ఉండాలి. చేయడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గుతుంది.
3. ఉప్పు నీటితో  పుక్కిలించడం వల్ల గొంతులోని గరగర తగ్గి, దగ్గు జలుబు తగ్గుముఖం పడతాయి. ఉప్పునీటికీ గొంతులోని కఫం తగ్గించే గుణం ఉంటుంది.
4. అల్లం కషాయం రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల, అందులోని సుగుణాలు కఫాన్ని తొలగించి,దగ్గు, జలుబుకు ఉపశమనం కలిగిస్తాయి.సాధారణ వ్యక్తులు కూడా అల్లం కషాయంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
5. పసుపు.. ఒక గ్లాస్ పాలలో, అర టీ స్పూన్ పసుపు  వేసి, గోరువెచ్చగా ఉన్నట్టుగానే నెమ్మదిగా తాగుతూ  ఉంటే, ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్  గుణాలు,గొంతులోని బ్యాక్టీరియా మరియు వైరస్ నశింప చేసి , దగ్గు జలుబుకు ఉపశమనం కలిగిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: