ఈ తులసి అన్ని రోగాలకి దివ్యౌషధం?

Purushottham Vinay
తులసి ఆరోగ్యానికి ఎంత మంచి మేలు చేస్తుందో  మనందరికీ తెలుసు.కానీ మధురమైన తులసి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? దాని రుచి వల్లనే దానికి ఆ పేరు వచ్చింది. ఈ తులసి చక్కెర తీపి కంటే ఏకంగా 300 రెట్లు తియ్యగా ఉంటుంది. ఇక ఈ తులసి పేరు స్టెవియా. ఇది ఆరోగ్యానికి ఎంత బాగా ఉపయోగకరంగా ఉంటుందో రుచిలో కూడా అంతే తీపిగా ఉంటుంది. అయితే ఈ తీపి తులసి చాలా ఖరీదైనది. ఇది చాలా తీవ్రమైన వ్యాధులని నయం చెయ్యడంలో వినియోగించబడుతుంది. ఇంకా అంతే కాదు, దీని ఉపయోగం  శరీరాన్ని కూడా బలపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.అయితే ఈ తీపి తులసి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే కాకుండా, అన్ని వయసుల వారికి, పిల్లలు ఇంకా అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు, స్వీట్లను తినడానికి ఇష్టపడే వారికి ఇది నిజంగా ఒక వరం. ఇక ఈ తులసిని ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇది షుగర్ రోగులకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఈ తులసిని చాలా సంవత్సరాలుగా స్వీటెనర్‌గా ఉపయోగిస్తున్నారు.


ఇది తీపిగా ఉన్నప్పటికీ షుగర్ రోగులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని వాడకం వల్ల షుగర్ పేషెంట్లలో షుగర్ ఈజీగా కంట్రోల్ ఉంటుంది.ఇంకా అలాగే రక్తంలో ఉండే గ్లూకోజ్‌పై స్టెవియా ప్రభావం చాలా తక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇంకా అలాగే కార్బోహైడ్రేట్ నియంత్రిత ఆహారం తీసుకునే వారికి ఇది చాలా మంచి సహజ స్వీటెనర్‌గా పనిచేస్తుంది.ఈ తియ్యటి తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు కూడా తెలుపుతున్నారు. స్టెవియాలో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, ట్రైటెర్పెనెస్, కెఫినాల్, కెఫిక్ యాసిడ్ ఇంకా అలాగే క్వెర్సెటిన్ వంటి చాలా యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి మన శరీర రోగనిరోధక శక్తిపై ఖచ్చితంగా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.అలాగే ఈ తులసి జీర్ణ సమస్యలను దూరం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కడుపు నొప్పి ఇంకా అజీర్ణం వంటి సమస్యలను నయం చేయడంలో స్టెవియా సారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు స్టెవియా ఆకులను ఉడకబెట్టి, దాని సారాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల పొట్ట సంబంధిత సమస్యల నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: