ఈ పండు తింటే గుండె జబ్బులు మాయం?

Purushottham Vinay
దబ్బపండు  మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనివల్ల కండరాలు ఇంకా కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది. దబ్బకాయను ఉపయోగించడం వల్ల కాలేయం, గుండె ఇంకా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.ఈ పండు రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. దీంతో మనం దగ్గు, జలుబు ఇంకా అలాగే గొంతు నొప్పి వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కూడా ఉంటాము. బరువు తగ్గాలనుకునే వారు ఈ దబ్బపండును ఆహారంలో భాగంగా తీసకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే ఈ పండును ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. రక్తపోటు కూడా ఈజీగా అదుపులో ఉంటుంది.ఇంకా అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.


జుట్టు రాలడం ఇంకా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడే వారు దబ్బపండును తినడం వల్ల సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా ఇంకా ఆరోగ్యంగా పెరుగుతుంది.ఇంకా ఈ పండును ఆహారంలో భాగంగా తినడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి. దబ్బకాయను తినడం వల్ల మనం నోటిపూత, దంతాల సమస్యలు ఇంకా చిగుళ్ల సమస్యలను కూడా ఈజీగా నయం చేసుకోవచ్చు. ఈ దబ్బకాయను మనం నిమ్మకాయకు ఇంకా చింతపండుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించవచ్చు.ఈ దబ్బకాయను ఆయుర్వేదంలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. వాత, కఫ దోషాలను తొలగించడంలోఈ పండును ఎక్కువగా వాడతారు. తేనెటీగ కుట్టినప్పుడు ఈ పండు రసాన్ని కుట్టిన చోట రాయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ పండును తీసకోవడం వల్ల చర్మం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎముకలు కూడా చాలా ధృడంగా తయారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: