వెల్లుల్లి: ఈ సమస్యలు ఉంటే తీసుకోవద్దు?

Purushottham Vinay
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మన ఇంట్లో లభించే వెల్లుల్లిని మనం వండుకునే వంటల్లో వేయడం వల్ల ఆహారం రుచి రెట్టింపు అవ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.మనం తినే ప్రతి వంటలో కూడా ఈ వెల్లుల్లిని చాలా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.ఇంకా దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనిని తినాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. వెల్లుల్లి చాలా మందికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొన్ని వ్యాధులతో బాధపడేవారు మాత్రం ఈ వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి.ఈ వెల్లుల్లి శీతాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇంకా అలాగే వెల్లుల్లిని వేసవిలో కూడ  తినవచ్చు.. కానీ దాని తక్కువ మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.


అధిక రక్తపోటు, గ్యాస్ ఇంకా కడుపు నొప్పి వంటి కొన్ని సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లి అస్సలు తినకూడదు. కాదని తింటే మాత్రం ఖచ్చితంగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.ఇక ఆయుర్వేద వైద్యుల ప్రకారం, అధిక రక్తపోటు, అసిడిటీ, గ్యాస్‌తో బాధపడేవారు, కడుపులో మంట ఇంకా లూజ్ మోషన్‌తో బాధపడేవారు వెల్లుల్లిని అస్సలు తినకూడదు. దీన్ని తింటే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కొన్నిసార్లు గుండెపోటుకు కూడా కారణం అవుతుంది.ఇంకా ఈ వెల్లుల్లి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ ఇంకా స్టమక్ ఇరిటేషన్ కూడా ఎక్కువగా పెరుగుతాయి. లూజ్ మోషన్ సమయంలో కూడా వెల్లుల్లిని తీసుకోవడం ఖచ్చితంగా మానేయాలి.ఇంకా అధిక కొలెస్ట్రాల్ తో బాధ పడే రోగులకు కూడా వెల్లుల్లి హానికరంగా పరిగణించబడుతుంది. ఈ సమస్యలు ఉన్నప్పటికీ మీరు వెల్లుల్లిని తినాలనుకుంటే మాత్రం చాలా తక్కువ పరిమాణంలో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: