జుట్టు రాలుతుందా? అయితే ఈ నూనె రాయండి?

Purushottham Vinay
చాలా మందికి జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య అందరిని ఎంతగానో వేధిస్తుంది.30 ఏళ్ళు నిండకుండానే చాలా మంది యువతి యువకులకు ఈ సమస్య తీరని తలనొప్పిగా మారింది. అయితే ఈ సమస్యని తగ్గించుకోడానికి ఆవనూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ బాక్టీరియల్ ఇంకా అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.అందువల్ల ఇది జుట్టుకు చాలా రకాలుగా మేలు చేస్తుంది.మస్టర్డ్ ఆయిల్ స్కాల్ప్ ను ఉత్తేజపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఆముదం నూనెలో కూడా ఔషధ గుణాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు నూనెలను కలిపి రాసుకుంటే జుట్టు చాలా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. జుట్టును దృఢంగా, ఒత్తుగా ఇంకా అలాగే మెరిసేలా కూడా చేస్తుంది. ఇక దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. ఆవాలు-ఆముదం నూనె తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకోని ఇందులో ఆవాల నూనె, ఆముదం నూనె సమాన పరిమాణంలో తీసుకోవాలి.ఆ తరువాత ఈ నూనె మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి. తర్వాత జుట్టుకు దాన్ని నేరుగా అప్లై చేయాలి.


ఇది జుట్టులో రక్త ప్రసరణను బాగా ప్రోత్సహిస్తుంది.ఇంకా అలాగే ఇది జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. దీంతో జుట్టుకు తగినంత పోషణ అనేది భిస్తుంది. ఇది జుట్టును చాలా బలంగా కూడా చేస్తుంది.ఈ నూనెలు జుట్టులో ఉన్న చుండ్రును కూడా చాలా ఈజీగా తొలగిస్తాయి.దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ, పొడవుగా, ఒత్తుగా మారుతుంది. సౌందర్య నిపుణుల అభిప్రాయం ప్రకారం జుట్టు కడగడానికి కనీసం 4 గంటల ముందు ఈ నూనెతో జుట్టును బాగా మసాజ్ చేయాలి. మంచి ఫలితాల కోసం వారంలో 2-3 సార్లు అప్లై చేయాలి. ఎక్కువ సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడుతారు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి. జుట్టు రాలే సమస్య నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: