దానిమ్మతో బోలెడు లాభాలు..ఈ రోగాలన్నీ పరార్..!

Divya
ప్రకృతిలో లభించే ప్రతి పండు లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి.  అలాంటి వాటిలో దానిమ్మ కూడా ఒకటి... నిజానికి ఒక దానిమ్మ పండులో 600 వరకు గింజలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో పోషకాలు చాలా నిండుగా వుంటాయి కాబట్టి శరీరం లోపల బయట మన ఆరోగ్యాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  ఇక పోతే శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో దానిమ్మ మొదటి పాత్ర వహిస్తుంది.. అందుకే చాలామంది డాక్టర్లు తమ వద్దకు వచ్చిన రోగులకు దానిమ్మ గింజలు ఎక్కువగా తినమని సూచిస్తూ ఉంటారు..
అధిక రక్తపోటు,  యాక్సిడెంట్ స్ట్రెస్ , వాపులు,  ఎక్కువ కొలెస్ట్రాల్ వంటి సమస్యలు దూరం చేయడంలో దానిమ్మ చక్కగా పనిచేస్తుంది.  దానిమ్మ గింజలను నేరుగా తిన్నా లేదా రసం చేసుకుని తిన్నా సరే ఫలితాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇకపోతే దానిమ్మ గింజలలో విటమిన్ బి, విటమిన్ సి  తో పాటూ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అంతే కాదు ఇందులో కాల్షియం,  పొటాషియం వంటి పలు రకాల పోషకాలు కూడా ఉంటాయి. ఇకపోతే మరి ఇన్ని పోషకాలను కలిగిన దానిమ్మను ఎక్కువగా తీసుకోవాలి.. దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపరిచి వదులుగా మారిన పళ్ళను గట్టి పరచడంలో దానిమ్మ సహాయపడుతుంది.  నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి చెడువాసన ను దూరం చేస్తుంది.
దానిమ్మ గింజలలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే శక్తి ఉంది.  ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.  అలాగే శరీరంలోని కొవ్వులు,  ప్రోటీన్లు,  కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడానికి ఈ దానిమ్మ  గింజలు సహాయపడతాయి.  అలాగే దానిమ్మ గింజల్లో పీచు పదార్థం ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. దానిమ్మ గింజల్లో పీచు పదార్థం  ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగి వివిధ రకాల వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: