ఆరోగ్యం: తవుడు వల్ల ఎన్నో ప్రయోజనాలు..?

Purushottham Vinay
మనం మన పాడి పశువులకు వాడే తవుడు వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ తవుడులో ఉండే గామా ఒరైజనాల్ అనే రసాయన సమ్మేళనం ఇన్ ప్లామేషన్ కు కారణమయ్యే ఎంజైమ్ లను చాలా ఈజీగా నశింపజేస్తుంది. దీంతో శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా అలాగే తవుడును తీసుకోవడం వల్ల అన్ని రకాల బి కాంప్లెక్స్ విటమిన్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి.ఇంకా అలాగే 100 గ్రాముల తవుడులో మొత్తం 45 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా ధాన్యాల్లో పై పొరల్లో ఎక్కువగా సూక్ష్మ పోషకాలు అలాగే స్థూల పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ధాన్యాల పై పొరల్లో చాలా ఎక్కువగా ఉంటాయి.


మనం ధాన్యాలను పాలిష్ పట్టడం వల్ల ఈ పోషకాలన్నీ తవుడులోకి వస్తున్నాయి. దీంతో మనం బియ్యం తీసుకోవడం కంటే తవుడును తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అధిక ప్రయోజనాలను పొందగలుగుతాము. తవుడును పోషకాల గని అని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తవుడును ఎక్కువ మొత్తంలో తీసుకుని ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ చేసుకోవాలి. ఈ తవుడును చపాతీ పిండిలో లేదా నీటిలో కలిపి తినవచ్చు. ఇంకా అలాగే దీనిని వేయించి మినుములతో కలిపి లడ్డూలుగా చేసుకుని కూడా తినవచ్చు.ఇంకా అలాగే దీనిని నేరుగా కూడా తినవచ్చు. పిల్లల నుండి పెద్దల దాకా ఇలా ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా దీనిని తీసుకోవచ్చు. ఈవిధంగా తవుడును ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరం బలంగా ఉండడంతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణుల తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: