సోయాబీన్స్ వలన కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో..!

Divya
అత్యధిక ప్రోటీన్స్ ను అందించే ఆహార పదార్థాలలో సోయా బీన్స్ ముందు వరుసలో ఉంటుంది.వంద గ్రాముల సోయా కిలో మాంసపు పోషకాలతో సమానం అని చెప్తుంటారు.ఎక్కువ శక్తినిచ్చే ఆహారంగా సోయాను
చెప్పవచ్చు.శరీరానికి కావాల్సిన అన్ని రకాల అమైనో  ఆమ్లాలు ఇందులో ఉన్నాయి. సోయా పిండి, సోయా పాలు, సోయా బీన్స్ ఇలా అనేక రకాలలో సోయ లభిస్తుంది.
 వయసు పెరిగే కొద్దీ వచ్చే వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మం పాలిపోవడం, చర్మంపై ముడతలు పడటం, చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలు లాంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మం తేమగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మపు కణాలను  తిరిగి పునరుద్ధరిస్తుంది.
 సోయా మృదువైన మరియు కాంతివంతమైన  జుట్టుని ఇవ్వడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా సోయాను ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జుట్టును పొందవచ్చు. అంతేకాకుండా గోర్లు పెలుసుబారే సుమారు సమస్యను తగ్గిస్తుంది.
మహిళల్లో ఒక దశలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. గుండె మరియు మధుమేహం, ఊబకాయంతో పాటు అనేక శారీరక మరియు మానసిక  రుగ్మతులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు సోయాను ఆహారంలో తీసుకోవడం వల్ల ఆగిపోయిన లేదా తగ్గిపోయిన ఈస్ట్రోజన్ ను తిరిగి ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సోయా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.హానికర పదార్థాలను శరీరం బయటికి పంపడంలో సహాయపడుతాయి.
సోయాలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్  సమృద్ధిగా ఉన్నాయి..ఇందులో ఉండే కీలక పోషకాలు నొప్పులు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.మధుమేహ వ్యాధి గ్రస్తులు సోయాని తీసుకోవడం ద్వారా రక్తంలోని గ్లోకోస్ స్థాయిలను తగ్గించుకొనవచ్చు. కాబట్టి తప్పకుండా మీ ఆహారంలో సోయాబీన్స్ ఉండేలా చూసుకోవాలి అప్పుడే మీ ఆరోగ్యానికి మరింత ప్రయోజనం చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: