గుమ్మడికాయ విత్తనాలు వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనలా..!

Divya
సాధారణంగా గుమ్మడి కాయను దిష్టి తీసి పడేస్తుంటారు. కానీ వాటి గింజలలో ఉండే పోషకాలు అన్ని ఇన్ని కావు.వాటిలో మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్స్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే తరచుగా గుమ్మడి విత్తనాలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
ఎముకల ఆరోగ్యానికి..
గుమ్మడిగింజల్లో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. ఎముకలు తయారు అవ్వడానికి మరియు  దృఢంగా  ఉండటానికి ఉపయోగపడుతుంది. గుమ్మడిగింజలను ఎక్కువ తీసుకోవడం వల్ల  అస్థియోపోరోసిస్ వంటి వ్యాధులను సులభంగా తగ్గించుకోవచ్చు.
మధుమేహం తగ్గించడానికి..
ఈ మధ్య కాలంలో చాలామంది మధుమేహంతో ఇబ్బందిపడుతున్నారు.అలాంటి వారికి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండవు. మధుమేహం ఉన్నవారు తరచుగా గుమ్మడి విత్తనాలను తింటే వాళ్ల వారి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండి, మధుమేహాన్ని తగ్గిస్తాయి.
గుండె ఆరోగ్యానికి..
ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కళంగా ఉంటాయి.అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.దీని వల్ల గుండేసంబంధిత సమస్యలు దరి చేరవు.
 అధికబరువు తగ్గడానికి..
గుమ్మడిగింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది.దానితో ఎక్కువగా వేరే పదార్థాలను తీసుకోలేరు కాబట్టి బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
 మంచి నిద్రకు..
 కొంతమందికి రాత్రిళ్లు ఎంతసేపటికి నిద్ర పట్టదు. అలాంటి వాళ్లు గుమ్మడికాయ గింజలు తింటే అందులోని ట్రైప్టోఫాన్  నిద్ర వచ్చేలా చేస్తుంది.

 వేడిని తగ్గించడానికి..
 గుమ్మడి గింజలలో కెరాటెనాయిడ్స్, విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను తరుచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. శరీరకణాలను విష సూక్ష్మక్రిముల నుంచీ రక్షిస్తాయి.రోజూ ఈ గింజలు తీసుకోవడం వల్ల జలుబు, జ్వరం వంటివి కూడా దరిచేరవు.
జుట్టు ఆరోగ్యానికి..
ఈ గింజల్లో కుకుర్బిటిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. అది జుట్టు పెరగడానికి దోహద పడుతుంది.. అలాగే జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: