ఈ వ్యాధితో బాధపడేవారు బాదాం తింటే అంతే సంగతులు..!

Divya
ఈ మధ్య కాలంలో డైట్ పేరు చెప్పి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. వీటిని తినడం వల్ల చలికాలంలో శరీరం వెచ్చగా ఉండడంతోపాటు ఆకలి కూడా కంట్రోల్ లో ఉంటుంది.జీడిపప్పు కూడా డ్రైఫ్రూట్స్‌లో తక్షణ శక్తి ఇవ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది శరీర ఆరోగ్యానికే కాదు, మనసు ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.బాదంపప్పులో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది కొన్ని వ్యాధులతో బాధపడేవారికి తీవ్ర అనారోగ్యం కలిగిస్తుంది. బాదాం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎవరెవరికి అనారోగ్యం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం..!

1). కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి..
బాదంలో వున్న ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు, ముఖ్యంగా డయాలసిస్ చేయించుకొనేవారు  బాదంపప్పుకి దూరంగా ఉండటం చాలా మంచిది.
2).అలర్జీ వచ్చే ప్రమాదం:
బాదంపప్పులో అమాండిన్ అనే ప్రోటీన్అధికంగా ఉండటం వల్ల చాలా మందికి అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది. అలెర్జీ సమస్యలు ఉన్నవారు బాదాం తినే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
3).డయేరియా వచ్చే ప్రమాదం:
బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ, డాఏరియా సమస్యలు వస్తాయి.
4).శ్వాసకోశ సమస్యలు:
ఇందులో హైడ్రోసియానిక్ అనే ఆమ్లం ఉంటుంది. శరీరంలో అధిక మొత్తంలో HCN ఉంటే, అది శ్వాస సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తుంది.
5),బాదంతో ప్రయోజనాలు..
బాదంలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.ఇవి సరైనా మొతాదులో తింటే శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె సంబంధిత వ్యాధులకు కారణమయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయ పడుతుంది.
అంతేకాక , బాదం డయాభేటీస్ రోగులకు చాలా బాగా సహాయపడుతుంది.ఎవరైనా బాదంపప్పును 3మాసాల పాటు క్రమం తప్పకుండా తీంటే , మీ hp స్థాయి మునుపటితో పోలిస్తే తగ్గుతుందని వెల్లడైంది.దీనితో రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయి మధుమేహం అదుపులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: