ఎముకల ఆరోగ్యానికి ఇవి తినండి?

Purushottham Vinay
చియా గింజలు, గసగసాలు ఇంకా అలాగే సెలెరీ వంటి పదార్థాల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పదార్థాలు ఎముకలు చాలా బలంగా ఉండేందుకు సహాయం చేస్తాయి. చియా గింజల్లో ఉండే ఖనిజ బోరాన్ ఎముకల అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది.కోడి గుడ్లలో ప్రోటీన్, కాల్షియం ఇంకా అలాగే విటమిన్ డి వంటి వివిధ పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కూడా మన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇక గుడ్డులో తెల్లగా ఉండే పదార్థమే కాకుండా.. మొత్తం గుడ్డు తినడం కూడా చాలా మంచిది.సాధారణంగా నట్స్‌లో వివిధ రకాల పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్ ఇంకా అలాగే కాల్షియం ఎక్కువుగా ఉండే వాటిలో బాదంపప్పు ఒకటి. ఇవి మన ఎముకలు, కండరాలు ఇంకా కీళ్ల  ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తాయి.సాల్మన్, ట్యూనా ఇంకా అలాగే హిల్సా వంటి కొవ్వు చేపలలో కాల్షియం, విటమిన్ డి మొదలైన పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.


ఈ పోషకాలు మన ఎముకల ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తాయి. కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి.గ్రీన్ లీఫ్ వెబిటేబుల్స్ గా పిలిచే క్రూసిఫెరస్ కూరగాయల్లో పోషకాలు చాలా అంటే చాలా ఎక్కువుగా ఉంటాయి. వీటిలో పాలకూర, బచ్చలికూర, క్యాబేజీ, బ్రోకలీ ఇంకా కాలీఫ్లవర్ వంటి కూరగాయలను ఆహారంతో తీసుకోవడం ద్వారా మన ఎముకలు ఇంకా కండరాలు బలంగా ఉంటాయి.ఇక శాఖాహరులు కాల్షియం ఉన్న పదార్థాలను తీసుకోవాలటే టోఫుని తినవచ్చు. దీనినే బీన్ పెరుగు అని కూడా అంటారు. టోఫులో కొలెస్ట్రాల్ ఉండదు ఇంకా సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇతర సోయా బీన్స్ పదార్థాలైన టేంపే ఇంకా సోయా పాలు వంటి వాటిలో కాల్షియం అలాగే విటమిన్ D చాలా ఎక్కువుగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: