లైఫ్ స్టైల్: కర్పూరం వల్ల ఇన్ని ఉపయోగాలా..!!

Divya
హిందూమతంలో కర్పూరానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. దీనిని రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల పలు రకాల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా కర్పూరం ఇంటికి సంతోషాన్ని శ్రేయస్సును అందిస్తుంది. దీని సహాయంతో జీవితంలోని ప్రతి కష్టాలను కూడా మనం అధికమించవచ్చు. అయితే ఈ కర్పూరం వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

1). కర్పూరం మనకు చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ముఖ్యంగా దీని తయారు చేసే విధానం కూడా  ఒక ప్రత్యేకమైన మొక్కనుంచే తయారవుతుంది. ఇది సాధారణంగా మూడు రకాలుగా ఉపయోగిస్తారు. కర్పూరం పూజకు ఔషధానికి సువాసనకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.
2). ఏ ఇంట్లోనైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కర్పూరాన్ని వెలిగిస్తే ఆ ఇల్లు చాలా సుఖసంతోషాలతో ఉంటుంది. ముఖ్యంగా కఫా, వాత సమస్యలను కూడా నివారిస్తుంది.
3). కర్పూరం నూనె చర్మం లో రక్తప్రసరణను కూడా సులభతరం చేస్తుందట. కర్పూరం నూనె చర్మం లో రక్త ప్రసరణను కూడా చాలా సులభంగా అయ్యేలా చేస్తుంది

4). ముఖం మీద మొటిమలు, జిడ్డు గల చర్మం ఉన్నవారు కర్పూరం నీటిని అప్లై చేసినట్లయితే ఇది ఒక ఆర్థో ఫైవ్ థిస్ గా పని చేస్తుంది.

5). స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలలో చర్మం దురదలు మంటలకు ఒక కప్పు కొబ్బరి నూనెల కర్పూరాన్ని కాస్త మిక్స్ చేసి ఆ తర్వాత చర్మం మీద అప్లై చేస్తే వీటి నుంచి విముక్తి పొందవచ్చు.

 6).కాళ్ల మడమలకు కర్పూరం నూనెను పట్టించినట్లు అయితే కాళ్ల మడమలు చీలిన వారికి ఉపశమనం పొందవచ్చు. ఇక వేడి నీటిలో కర్పూరాన్ని కలిపి స్నానం చేయడం వల్ల సుఖ నిద్ర వస్తుందట.
7).జలుబు దగ్గు విషయంలో వేడి నీటిలో కర్పూరం ఆవిరి తీసుకున్నట్లయితే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే దగ్గు ఎక్కువగా ఉన్నట్లు అయితే ఆవాలు లేదా నువ్వుల నూనెలో కర్పూరాన్ని కలిపి చాతి పైన పట్టించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: