ఉదయం నిద్ర లేవగానే వీటిని అస్సలు మర్చిపోకండి..!!

Satvika
ఒకప్పుడు ఉదయం నిద్ర లేవగానే దేవుడిని ప్రార్ధిస్తారు.. ఇప్పుడు మాత్రం ఫోన్ ను పట్టుకుని కూర్చుంటున్నారు. దీంతో ఎంత సమయం వృథా అవుతుంది. అందుకే ఉదయం నిద్రలేచిన తరవాత ఫోన్‌ ఉపయోగించకూడదు.అది అత్యవసరం అయితే తప్ప అస్సలు వాడకూడదు.రోజుని ఎంత ఉషారుగా మొదలు పెడితే ఫలితాలు అంత విజయవంతంగా వస్తాయి. మరి ఉదయం నిద్రలేచిన తరవాత ఏఏ పనులు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
*. ముందుగా ఉదయం లేచిన తర్వాత రెండు గ్లాసుల నీళ్లు తాగండి. ఇది మీరు రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా పని చేసేందుకు ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా వాటర్‌ బాటిల్‌ వెంట పెట్టుకుని వెళ్లండి.
*.ప్రాణాయామం, యోగా చేయండి. తరచూ చేస్తూ ఉండటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* ఆవిరి పట్టుకోండి..
వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు , ఊపిరి సులువుగా తీసుకునేందుకు ఆవిరి పట్టుకోవడం మంచి పద్ధతి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* ఆరోజు చేయాల్సిన పనులన్నిటినీ డైరీలో రాసుకోండి.
* అల్పాహారం తప్పకుండా చేయాలి. సరైన సమయానికి ఆహారం తీసుకున్నపుడే పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలరు..
*.ఓ మైలు దూరం వరకూ జాగింగ్‌ చేయండి. దీంతో మీ కండరాలకు శక్తి చేకూరుతుంది. శరీరం ఫిట్‌గా ఉంటుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది..
*.ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టే పని ఏదైనా మంచి ఫలితాలను ఇస్తుంది. మీ రోజుని ఆనందంతో, విశ్వాసంతో ఆరంభించండి. విజయం తప్పక మీ సొంతమవుతుంది.
*.చిరాకులు,గొడవలు పడకుండా చూసుకోవాలి.. మన ఆరోగ్యం మనకు ముఖ్యం..
*. మన తోటి వారితో నవ్వుతూ మాట్లాడటం చెయ్యడం చాలా మంచి అలవాటు..ఇలా చెస్తె మనసు హాయిగా వుంటుంది.
*. ఉదయం చల్ల నీటి స్నానం చెయ్యడం చాలా మంచిది..అ తర్వాత గుడికి వెళ్ళే అలవాటు వుంటే అలా వెళ్ళి రావడం చాలా మంచిది.మనసు ప్రశాంతంగా వుంటుంది.పైన తెలిపిన పనులను క్రమం తప్పకుండా చేస్తే మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: