బుడుగు: పిల్లల పర్సనాలిటీ డెవల్మెంట్ కోసం ఈ టిప్స్ పాటించండి..!!

N.ANJI
తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏది మంచి, ఏది చెడో నేర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు.. అప్పుడే పిల్లల్లో మంచి లక్షణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలాంటి సద్గుణాలు ఉన్న పిల్లలకు మంచి వ్యక్తిత్వ సామర్థ్యాన్ని కలిగిస్తాయని చెప్పుకొచ్చారు. పిల్లలను పర్యావరణం, ఇతర కార్యకలాపాల ద్వారా పిల్లలలో వ్యక్తిత్వ నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేయాలో ఒక్కసారి చూద్దామా.
పేరెంట్స్ తమ పిల్లల వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి చేయవలసిన మొదటి పని పిల్లలు చెప్పేది శ్రద్ధగా వినాలి. పిల్లల ఆలోచనలు మీరు గౌరవించాలి. అంతేకాదు.. పిల్లలు స్వచ్ఛందంగా ఏదైనా అసాధారణమైన ఆలోచనతో ముందుకు వస్తే, వారు తమ స్థితిని పునఃసమీక్షించవలసి ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా చేయడం వలన  పిల్లలకు తమపై నమ్మకం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే పిల్లలలో ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటారని అన్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను ఒక్కరితో పోల్చకూడదు. అయితే పిల్లలను పోల్చడం వల్ల వారిలో హీనంగా అనిపించవచ్చునని అన్నారు. ఇక పిల్లలు కలిగి ఉండే నైపుణ్యాలను ఎల్లప్పుడూ అభినందించండి, ఆనందించాలని చెబుతున్నారు. అలా చేయడం ద్వారా పిల్లలలో ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుందని అన్నారు.
పిల్లలకి తక్కువ స్క్రీన్ సమయం ఇవ్వాలి. కానీ ప్రస్తుతం మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లను  పిల్లలకు ఇస్తున్నారు. అది మంచిది కాదు.. పిల్లలకు డిజిటల్ స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడపడం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులకు నేర్పించాలి. అంతే ముఖ్యంగా పిల్లలకు అవసరమైన అన్ని స్వేచ్ఛను ఇస్తూ ఉండాలి. వారికి నచ్చిన పని చేసేలా చూడండి. ఆలా చేయడం వలన పిల్లలు మంచి వ్యక్తిత్వ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఇక వీలైనంత వరకు తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించేందుకు చూడాలి. పిల్లల శారీరకంగా, వారిని మానసికంగా అభివృద్ధి చేసేందుకు, వారికి ఇష్టమైన వాటి గురించి మాట్లాడటానికి, అనేక ప్రేమపూర్వక విషయాలను పంచుకోవడానికి వారితో సమయం ఇస్తుండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: