బుడుగు: చిన్న పిల్లలను ఇలా పెంచకూడదు..?

N.ANJI
సాధారణంగా చిన్న పిల్లలు ఒత్తిడికి అలవాటు పడకపోతే.. ఎదుగుతున్న సమయంలో దాని ప్రభావం వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పెద్దయ్యాక గుండెపోటు, డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి కష్టాలూ రాకుండా సుకుమారంగా, గారాభంగా పెంచుతూ ఉంటారు. ఇక పిల్లలు చిన్నపుడు ఎంత సుకుమారంగా బ్రతుకుతారో పెద్దయ్యాక మానసిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజాగా.. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో చిన్ననాటి అనుభవాలు, పెద్దయ్యాక ఎలా ప్రభావం ఉంటుంది..? ఇక ఈ అనుభవాలు మానసిక ఆరోగ్యంతో ఎలా సంబంధం కలిగి ఉంటాయి? వంటి ప్రశ్నలపై అధ్యయనం జరుగుతుంది. దాని ఫలితాలు ఆసక్తికరంగా వచ్చినట్లు తెలిపారు. అయితే బాల్యంలోని సానుకూల, ప్రతికూల అనుభవాలు యుక్తవయస్సులో ఆందోళన లేదా ఇతర మానసిక రుగ్మతలకు కారణమవుతాయని పరిశోధకులు వెల్లడించారు.
అయితే ఈ అధ్యయనం ఆస్ట్రేలియాకు చెందిన 4 నుంచి 11 సంవత్సరాల మధ్య గల 3,14,000 మంది బాలబాలికపై పరిశోధనలు చేశారు. ఇక ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది ప్రజలు బాల్యంలో సంతోషంగా జీవించినప్పటికీ, అందులో దాదాపు 50 శాతం మంది యుక్తవయస్సుకు వచ్చాక వారి జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడి చెందుతున్నారని పేర్కొన్నారు. కాగా.. మానసిక ఆరోగ్య పరిస్థితులను బాల్యంలోని జీవిత సంఘటనలను బట్టి నిర్వచించలేమని అధ్యయనం స్పష్టం చేసినట్లు తెలిపారు.

అయితే సంతోషకరమైన ఇంటిలో పెరిగిన పిల్లవాడు సైతం పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉందని ఈ పరిశోధన వెల్లడించింది. అంతేకాక.. ఈ అధ్యయన ఫలితాలు ‘కరెంట్ ఫిలాసఫీ’ అనే జర్నల్‌లో పేర్కొన్నారు. చిన్నపిల్లలు పెద్దయ్యాక తమ అంచనాలను అందుకోనప్పుడు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అందుకే.. తల్లిదండ్రులు వారి పిల్లలను బాల్యంలో మరీ సుకుమారంగా పెంచకూడదని అన్నారు. ఇక పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉండాలో వారికి నేర్పించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: