బుడుగు: పిల్లలు పుట్టగానే ఏడిస్తే మంచిదేనా..??

N.ANJI
చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుట్టిన బిడ్డను వెచ్చటి శుభ్రమైన దుస్తులలో ఉంచి తల్లి శరీరం తగిలేలా వెచ్చగా ఉంచాలని చెబుతున్నారు. పిల్లలు కనుక నెలలు నిండకుండా పుట్టి వుంటే, హాస్పిటల్ సిబ్బంది బిడ్డను వేరుగా ఇన్ క్యుబరేటర్ వంటి సాధనాలలో ఉంచి ఆరోగ్యాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు వైద్యులు. ఇక అవసరమైన మందులు ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే పిల్లలకు పుట్టిన వెంటనే వేయాల్సిన పోలియో చుక్కలు, సూదిమందులను వేయమని వైద్యులను కోరాలి. ఇక పిల్లలకు చేయించే ఇంజెక్షన్లు, ఇతర పోలియో చుక్కలు, వ్యాక్సిన్లు లేదా ఇతర పరీక్షలన్నింటికి తగిన రికార్డు నిర్వహించాలని చెబుతున్నారు. అంతేకాక.. తల్లితండ్రులు తమ బిడ్డకు ఏ సమయంలో ఏ రకమైన వ్యాక్సిన్లు ఇప్పించాలనేది ఆ కార్డులో నమోదు చేసి ఉంటుంది. ఆ కార్డులో ఉన్న దానిని ప్రకారం.. బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం వరకు తల్లితండ్రులు తగిన రీతిలో ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు వేయించాలన్నారు. ఇక ఈ రకమైన చికిత్సలు బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు.
అంతేకాదు.. ఏ రకమైన అనారోగ్య సమస్యలు వచ్చినట్లు గుర్తించినా, వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా పిల్లల వైద్యులను సంప్రదించాలని సూచించారు. సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడ్వడం మంచిదని చెబుతుంటారు. పిల్లలు ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు వైద్యులు పిల్లలను ఏడిపించడం సాధారణం అని అన్నారు. ఇక మరోవైపు అప్పుడే పుట్టిన బిడ్డ ఈ ప్రపంచాన్ని చాలా భిన్నమైనదిగా గ్రహిస్తారని తెలిపారు.
అయితే అలా వారు జన్మించిన తరువాత కొంచెం చికాకును కలిగి ఉండవచ్చునని అన్నారు. అంతేకాదు.. వారు గర్భంలో ఉన్న వెచ్చదనాన్ని కోల్పోతారని చెప్పుకొచ్చారు. ఇక మీ బిడ్డ తన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన సొంత మార్గాలను కలిగి ఉంటుందని అన్నారు. కాగా.. మీరు విశ్రాంతిని కలిగి ఉంటూ ఆ మార్గంలోనే ముందుకు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: