బుడుగు: అప్పుడే పితికిన పాలను పిల్లలకు తాగించొచ్చా..??

N.ANJI
నేటి సమాజంలో చాలా మంది పిల్లల పోషణ కోసం పాలను తాగిస్తూ ఉన్నారు. అయితే పిల్లలకు అప్పుడే పితికిన పాలు తాగించడం మంచిదేనా. ఒక్కవేళ అప్పుడే పితికిన పాలు తాగిస్తే ఏం అవుతుందో ఒక్కసారి చూద్దామా. నేటి సమాజంలో వ్యాపారాలు పశువులకు పాలివ్వటానికి ఇంజెక్షన్‌ ఇస్తూ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆ ఇంజెక్షన్‌లోని రసాయనిక మందు పాలలోకి వెళ్తుంది. అంతేకాక.. పశువులకు వ్యాధులొస్తే, ఆ సంగతి తెలియక పిల్లలకు ఆ పాలను త్రాగించినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇక ముఖ్యంగా పసిబిడ్డకు త్రాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
అయితే ఈ రోజుల్లో, పట్టణాల్లో పశువుల పాలవాడకం తగ్గిపోయి బూత్‌పాలను వాడుతున్నారు. అంతేకాక.. స్కిమ్డ్‌ మిల్క్‌నే అందరూ ఇష్టపడి తింటుంటారు.  అంతేకాదు.. ఆ పాలల్లోంచి కొవ్వు తొలగించి ఉంటుంది. ఇక పిల్లలకు ఆ పాలు త్రాగించడం ఆరోగ్యకరమే అని అంటున్నారు. కాగా.. ఆ పాలల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ పాలల్లోంచి కొవ్వు పొర మాత్రమే తొలగిపోతుంది, పోషక పదార్థాలేమీ తొలగిపోవు అని అంటున్నారు. ఇక ఆ పాలలో కొవ్వు ద్వారా లభించేవి ఎ, డి విటమిన్‌ లు. 'ఎ' విటమిన్‌ ఆహార పదార్థాల ద్వారా దొరుకుతుంది. ఇక డి విటమిన్‌ సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందుతుందని అన్నారు.
ఆలా ఆ రెండు విటమినులను వారి శరీరానికి భర్తీ చేయవచ్చునని అంటున్నారు. అయితే స్కిమ్డ్‌ మిల్క్‌లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా దొరుకుతాయి. అంతేకాక.. పిల్లలు పాలు త్రాగటానికి ఇష్టపడకపోతే, ఏ రూపంలోనైనా పాలతో తయారుచేసిన పదార్థాలను ఇవ్వవచ్చునని అన్నారు. అంతేకాక.. పిల్లల ఎదుగుదలకూ, నూతన శక్తికీ, శారీరక దృఢత్వానికీ వారికి ప్రతిరోజూ పాలను లేదా పాలతో తయారయ్యే పదార్థాలను ఇవ్వడం ఎంతో ముఖ్యం అని చెబుతున్నారు. కాగా.. పిల్లలకు గోరు వెచ్చని, వేడి పాలు తాగిస్తే మంచిది. అప్పుడే పిండిన పాలను అలాగే తాగించకూడదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: