బుడుగు: పిల్లలు చిన్నప్పుడే కళ్లద్దాలు వాడుతున్నారా..??

N.ANJI
నేటి సమాజంలో పెద్దవారి నుండి చిన్న పిల్లల వరకు కంటి సమస్యలు అనేవి కామ‌న్ అయ్యాయి. ఇక పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచి దృష్టి లోపాలు తలెత్తుతున్నాయి. దాంతో త‌ప్ప‌నిస‌రిగా క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సి వస్తుంది. అంతేకాక.. పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే దృష్టి లోపాలు వ‌చ్చేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే అవేమిటంటే.. సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు త‌గిలేలా ఉండ‌క‌పోవ‌డం, టీవీలు, కంప్యూట‌ర్లు, ట్యాబ్‌లు, ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే దృష్టి లోపాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాక.. కొంద‌రు పిల్ల‌ల్లో జన్యులోపం వల్ల, వంశ పారంపర్యంగా, ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు గాయాలు అయి కంటి చూపును కోల్పోయే అవ‌కాశాలు ఉంటాయని తెలిపారు. ఇక ఇలాంటి సంద‌ర్బాల్లోనూ దృష్టి లోపాలు  వస్తాయి. కాగా.. పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే క‌ళ్ల‌ద్దాల‌ను వాడే స్థితి రాకుండా ఉండాలంటే అందుకు కొన్ని సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక అవేమిటో ఇప్పుడు ఒక్కసారి చూద్దామా.
ఇక పిల్ల‌ల‌కు రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాలను అందివ్వాలి. అయితే వారికి దృష్టి లోపాలు చాలా వ‌ర‌కు పోష‌కాహార లోపాల వ‌ల్ల‌నే వస్తాయని తెలిపారులు. కావున  అన్ని విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ క‌లిగిన ఆహారాల‌ను వారికి రోజూ ఇవ్వాలని తెలిపారు. ఇక ముఖ్యంగా దృష్టి లోపాలు రాకుండా ఉండేందుకు గాను విట‌మిన్ ఎ ను అందించాల్సి ఉంది. కాగా.. విట‌మిన్ ఎ ఎక్కువ‌గా యాపిల్స్, కోడిగుడ్లు, ట‌మాటాలు, న‌ట్స్ వంటి ఆహారాల్లో సమృద్ధిగా దొరుకుతుంది. అంతేకాక..అలాగే పాల‌ను కూడా తాగించ‌వ‌చ్చునని చెబుతున్నారు.
అంతేకాదు.. పిల్ల‌లు రోజూ కొంత సేపు అయినా స‌రే వెలుతురు లేదా ఎండ‌లో గ‌డిపేలా చూడాలని తెలిపారు. అయితే ఫోన్లు, కంప్యూట‌ర్ల‌ను ఎక్కువ‌గా వాడకూడదు. ఇక అలా యూజ్ చేయాల్సి వ‌స్తే మ‌ధ్య మ‌ధ్య‌లో విరామం ఇచ్చేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: