బుడుగు: ఇక ఆ విషయంలో తల్లులు ఆందోళన చెందవద్దు..!

N.ANJI
సాధారణంగా మొదటిసారి బిడ్డకు జన్మినిచ్చిన తల్లులకు పిల్లల గురించి ఏమి తెలియకపోవడంతో చాల ఇబ్బందులు పడుతుంటారు. ఇక వారికి తమ చంటి బిడ్డ నిద్ర వేళల గురించి ఎక్కువగా కంగారు పడుతుంటారు. అయితే ఆరు నెలలు వచ్చేంత వరకు బిడ్డ రాత్రి పూట చక్కగా నిద్ర పోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలా జరగనప్పుడు ఆందోళన గురవుతూ ఉంటారు.

ఇక  అలాంటి భయాలేవి అవసరం లేదని, ఆరు నెలల లోపు పిల్లల నిద్ర వేళల్లో మార్పులు సహజమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక తాజా అధ్యయనం ప్రకారం.. ‘స్లీప్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో వచ్చిన ఈ అధ్యయనం సారాంశం వెల్లడించారు. అది ఏంటంటే.. కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మేరీ హెలెన్‌ పెన్నెస్ట్రీ బృందం ఆరు నెలల లోపు వయసున్న 44 మంది పిల్లల నిద్రవేళలను రెండు వారాలు పరిశీలించారని తెలిపారు.

అయితే ఆ రెండు వారాలు ఆ పసికందుల నిద్ర వేళలను డైరీలో రాయాల్సిందిగా వారి తల్లిదండ్రులను పరిశోధకులు కోరినట్లు తెలిపారు. ఇక రెండు వారాల తరువాత కొందరు తల్లులు తమ బిడ్డ అయిదు రోజులు రాత్రిపూట ఆరు గంటలు నిద్రపోయిందని అన్నారు. అలాగే మూడు రోజులు రాత్రిపూట ఎనిమిది గంటలు నిద్రపోయిందని తల్లిదండ్రులు తెలిపారు. అయితే అందరు పిల్లల్లో నిద్రవేళలు అందరిలోనూ ఒకేలా లేవు అని అన్నారు.

అంతేకాదు.. ఒక రాత్రికి మరొక రాత్రికి వారి నిద్రలో తేడాలు ఉన్నాయి అన్నారు. ఇక వీరిలో సగం మంది పిల్ల్లలు రాత్రిపూట 8 గంటల పాటు నిద్రపోలేదని పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు. అయితే  ‘‘చిన్న పిల్లల్లో  ఎదిగే క్రమాన్ని బట్టి వారి నిద్ర వేళలు ఉంటాయని అన్నారు. అందుచేత తల్లులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే తల్లులు పిల్లలకు సరిపోనూ పాలివ్వడం, వారి పక్కనే నిద్రించడం వల్ల పిల్లలు చక్కగా నిద్రపోయే అవకాశాలు ఎక్కువ’’మేరీ హెలెన్‌ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: