బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

N.ANJI
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చిన్నపిల్లలు ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పిల్లల ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది చిన్న పిల్లలు తినడానికి మారం చేస్తుంటారు. ఇక కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఆలా చేస్తున్నారని అలాగే వదిలేస్తుంటారు. ఇక ఆలా కాకుండా కొంచెం శ్రద్ధ తీసుకుని వాళ్లకు తినిపించడం వల్ల ఆరోగ్యంతో పాటు అలవాట్లు కూడా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో పిల్లలు ఫోన్లు, టీవీలకు  బాగా అలవాటు పడిపోవడంతో తిండి మీద ద్యాస తగ్గిపోయి సరిగ్గా తినరు. మరికొంత మంది పిల్లలు ఎక్కువగా తింటూ అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే పిల్లలు జంక్ ఫుడ్ అలవాటు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు కూడా అవే చేస్తుంటారు. ఆలా జరగకుండా ఉండాలంటే ముందు మనలో మార్పు రావాలన్నారు. ఇక తల్లిదండ్రులు పిల్లల ముందు మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలని పరిశోధకలు చెబుతున్నారు. అయితే పిల్లల కూడా మిమ్మలి చూసి అవే నేర్చుకుంటూ ఉంటారు. ఆలా పిల్లలకు కూడా మంచి అలవాట్లు వస్తాయి.
ఇక పిల్లలకు ఇంట్లో మనం పనిచేసేటప్పుడు హెల్ప్ చేయమని అడుగుతుండాలని చెబుతున్నారు. ఇక అలా చేస్తే వాళ్లకు చిన్నప్పటి నుండే హెల్పింగ్ నేచర్ అలవాటు అవుతుందన్నారు. అంతేకాదు.. పిల్లలకు బయట దొరికే ఫుడ్ అస్సలు పెట్టకూడదని అన్నారు. ఇక పిల్లలకు ఎక్కువుగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, పాలు పాల పదార్ధాలు వంటివి ఎక్కువగా పెట్టాలని అన్నారు. అంతేకాదు మరీ వాళ్లతో కఠినంగా కూడా ఉండకూడదని చెప్పుకొచ్చారు. అలాగే అప్పుడప్పుడు బయట ఫుడ్ పాప్ కార్న్ కానీ.. ఐస్ క్రీం కానీ కొనిపెడితే వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అవుతారని అన్నారు. ఇక ఇలాంటివి పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇలా చేయడం వలన పిల్లల ఫ్యూచర్ కు కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: