బుడుగు: గోళ్లు కొరికే పిల్లలకు ఐక్యూ తగ్గుతుందా..!
అయితే ఒత్తిడి మరీ ఎక్కకువైపోతే అది మెంటల్, ఎమోషనల్ డిజార్డర్ గా మారుతుందట. అదే కనుక జరిగితే పరిస్థితి ఎంత తీవ్రమవుతుందంటే నిద్రలో తమకు తెలీకుండానే గోళ్లు కొరికేసుకుంటారట. అలా కనుక చేస్తుంటే వెంటనే చైల్డ్ సైకియాట్రిస్టుకి చూపించి సమస్య ఏ స్థాయిలో ఉందో చూపించాలి. వాళ్ల మనసులో ఉన్న భయాలేంటో తెలుసుకుని వాటిని పోగొట్టాలి.
ఇక అస్తమానం గోళ్లు కొరుకుతూ ఉంటే... గోళ్లపై పేరుకున్న బ్యాక్టీరియా లాలాజలంతో కలిసి బుజ్జాయిల బొజ్జలోకి వెళ్లిపోతుంది. కాబట్టి వాళ్లు ఆ అలవాటు మానేవరకూ పిల్లల గోళ్లను ఎప్పటికప్పుడు మీరే కత్తిరించేయడం, చేతుల్ని శుభ్రంగా ఉంచటం చేయాలి. గోళ్లు కొరికే అలవాటున్న పిల్లల్లో ఐక్యూ తక్కువగా ఉంటుందని రష్యాలో జరిపిన ఓ పరిశోధనలో తేలింది. వాళ్లు చాలా డల్ గా ఉంటారట. దేనిలోనూ ప్రతిభ చూపించరట. మీ పిల్లలు కనుక చదువులో వెనుకబడుతుంటే... వాళ్లకి గోళ్లు కొరికే అలవాటుందేమో చూసుకోండి. ఉంటే వీలైనంత త్వరగా ఆ అలవాటుని దూరం చేయండి.
అంతేకాదు.. ఈ అలవాటు కనుక మరీ ముదిరిపోతే చికిత్స కూడా ఉంది. కౌన్సెలింగ్, హిప్నాటిజం ద్వారా ఈ అలవాటును పోగొడతారు. లేదంటే పళ్లకు ప్రివెన్టర్ అనే ఓ చిన్న క్లిప్పును అమరుస్తారు. ఇది గోళ్లు కొరికే ప్రయత్నానికి అడ్డు పడుతుంది. చూశారు కదా.. ప్రతి అలవాటు వెనుకా ఓ కారణం ఉంటుంది. అందుకే మీ పిల్లలు గోళ్లు కొరకడానికి లైట్ గా తీసుకోకండి. వీలైనంత త్వరగా ఆ అలవాటును పోగొట్టండి. అలవాటును సమస్యగా మారనీకండి.