బుడుగు: పిల్లల ప్రవర్తనకు తల్లిదండ్రులే బాద్యులు ఎలాగో తెలుసా..?

N.ANJI
పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులను చేసే అన్ని నేర్చుకుంటారు. అందుకే పిల్లల ముందు చాల పేరెంట్స్ చాల జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబసభ్యులుగాని ఏవైనా ప్రవర్తనా లోపాలు కనబరిచినప్పుడు వాటిని చుసిన పిల్లలు కూడా అలా ప్రవర్తిస్తారు. ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త  చెప్పిన  దాని ప్రకారం పిల్లలలో  కొన్ని ప్రవర్తన లోపాలు అంటే భయపడటం, పక్క తడపటం వంటి ప్రవర్తనలు చిన్న వయస్సులో కొన్ని సంఘటనల వల్ల జరుగుతాయని తెలిపారు.
ఇక పిల్లలు పక్కన  పిల్లలను గాయపరుస్తూ ఉంటారు. పిల్లలు  అలా చేసినప్పుడు వారిని తిట్టడం, కొట్టడం, కోపంగా ప్రవర్తించడం లాంటివి  చేయకూడదు. అలా చేసిన పిల్లలను అక్కడినుండి పక్కకు తీసుకువచ్చి వారి చేతిలో ఏమైనా గాయపరిచే వస్తువులు ఉంటే వాటిని తీసుకుని దూరంగా పెట్టాలి. ముందు వారు సంతోషంగా ఆడుకునే ఏర్పాటుచేసి నెమ్మది గా ప్రేమతో  అలా  చేయడం మంచిది కాదు  అని నచ్చచెప్పాలి.
అంతేకాదు.. అసూయ, ఆతురత, విసుగు, అత్యుత్సాహం కారణంగా పిల్లలు వస్తువులు పగలగొడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో  వారిని తిట్టడం,కొట్టడం పెట్టడం, కేకలు వేయడం, శిక్షించడం వంటివి  చేయకూడదు.పగిలే వస్తువులను దూరంగా ఉంచాలి. బిడ్డ ఆడుకోవడానికి అనువైన ప్రదేశం ఉండేలా చూడాలి . పిల్లలను క్రొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళాలి.పిల్లలు ఆడుకోవడానికి కొన్ని వస్తువులను ఏర్పాటు చేయాలి.అలా చేసిన తర్వాత  ఎటువంటి పనులు చేయాలో చేయకూడదో వివరంగా అర్ధం అయ్యేలా  చెప్పాలి.
అలాగె పిల్లలు ఇతరులను అనుకరించడం, లేదా ఇతరుల దృష్టి తన మీద ఉండాలని ప్రయత్నించడం లో భాగం గా  చెడు మాటలు మాట్లాడతారు. అలాంటి పరిస్థితుల్లో  అసహనంతో ఉండటం, చీవాట్లు పెట్టడం, శిక్షించడం వంటివి చేయరాదు. పిల్లలు అన్న మాటలు ఎందుకు  వచ్చాయి  ఎలా  నేర్చుకున్నారో  తెలుసుకునే ప్రయత్నం  చేస్తూ అటువంటి మాటలు మాట్లాడకూడదు అని నెమ్మదిగా వివరించాలి . పిల్లలకు రైమింగ్ పదాలు, ప్రాసతో కూడిన పదాలు నేర్పాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: