బుడుగు: పిల్లల మెదడు చురుగ్గా పని చేయాలంటే ఇలా చేయండి..!?
కాబట్టి పిల్లలను స్కూల్ కి పంపించేస్తే పని అయిపోదు వారిలో జ్ఞాపకశక్తి ఎంత ఉందని తెలుసుకోవడం తల్లిదండ్రుల బాద్యత అంటున్నారు నిపుణులు. ఒకవేళ జ్ఞాపకశక్తి తక్కువగా ఉంది అని అనిపిస్తే మాత్రం ఆహారంలో కాస్త జాగ్రత్త పాటించవలిసేందే అని అంటున్నారు.. న్యూట్రీషన్లు. మనం తీసుకునే ఆహారం కేవలం శరీరానికే కాదు మెదడుకు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు .
అందుకే తీసుకునే ఆహారంలో మెదడును ఉత్సహం గా ఉంచే ఆహారాన్ని కచ్చితం గా ఉండేలా చూడాలి మరి. పాలు, పాల ఉత్పత్తుల ను ఎక్కువగా ఇవ్వండి. మీ పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ డి అధిక శాతం ఉండేలాచూడాలి. స్ట్రాబెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందినపండ్లు , నేరేడు పండ్లు ఇవ్వడంవలన జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. విటమిన్- సి, యాంటి-ఆక్సిడెంట్స్, ఒమెగా 3 ఫాట్స్ వుండే పండ్ల ను కూడా పిల్లలకు ఇవ్వడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఇక ఓట్స్, ఎరుపు బియ్యం లో విటమిన్ బి, గ్లూకోజ్ అధికంగా ఉండటంవలన పిల్లలకు రోజూ ఆహారంగా పెట్టవచ్చు . దీని వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక చేపల్లో ఒమెగా 3 ఫాట్స్ అధికంగా ఉండటం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాబట్టి వారానికి రెండు సార్లు పిల్లలకు ఇచ్చే ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి.స్కూల్ కి వెళ్లే పిల్లలకి రోజూ ప్రొద్దున బాదం ఇవ్వడం వల్ల వారు చాలా యాక్టీవ్ గా ఉండడం తో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.