రాజు – సాధువులు

Durga
 ఒకరోజు రాజుగారు గుర్రంపై స్వారీ చేస్తూ అడవి మార్గాన పోతున్నాడు. అక్కడ కొంతమంది సాధువులు యాగం చేయడాన్ని అతడు గమనించాడు. అది బాగా చలికాలం అయినా ఈ సాధువులు భుజంపై ఉత్తరీయం కూడా ధరించకుండా ఉండడం అతడు చూశాడు. రాజుకు దయ కలిగింది. తన ప్రధాన అధికారిని పిలిచి ఆ సాధువులకు కావలసిన ఉన్ని గుడ్డలను ఇమ్మని ఆజ్ఞ జారీచేశారు. ఆ అధికారి రాజు ఆజ్ఞను వెంటనే పాటించాడు. అక్కడకు వచ్చిన రాజు వైపు చూసి ఒక సాధువు ‘‘ నేను మీకైమైనా సహాయపడగలనా ? అని అడిగాడు. సాధువు అన్న మాటలను విని రాజు ఆశ్చర్యపోయాడు. రాజుకు చాలా కోపం వచ్చింది. కాని శాంతంగానే ఉండిపోయాడు. ‘‘ మీనుండి నాకు ఎలాంటి సహాయం అక్కర్లేదు. ఈ చల్లటి వాతావరణంలో వస్త్రాలు లేకుండా ఉన్న మీమ్మల్ని చూడడం వల్ల మీ కోసం కొన్ని ఉన్ని వస్త్రాలను తెచ్చాను నేను ఈ దేశానికి రాజును అన్నాడు. ‘‘ అయితే చిన్న చిన్న దేశాలను జయించి వాటిని కొల్లగొట్టే రాజువు నీవే నన్నమాట దోపిడీదారుడు మాకు ఏమి ఇవ్వగలడడు ? అని రాజు ముఖంలోకి నిశితంగా చూస్తూ ఆ సాధువు చెప్పాడు. రాజుకు మరింత ఆశ్చర్యం వేసింది ప్రజల హౄదయాన్ని జయించినపుడే నీవు విజేతవు అవుతావు. మా వరకు మాకు ఏదీ అక్కరలేదు. మా దగ్గర ఉన్నంతలో మేము ఇతరలకు ఇవ్వగలం మీకు ఏమైనా కావాలా ? అని సాధువు తన మాటను పొడిగించాడు. తాను ఎదురు చూడని సంఘటన జరగడం వల్ల రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆ సాధువు మాటలలో దాగి ఉన్ సందేశాన్ని అతడు అర్ధం చేసుకున్నాడు. రాజు ఆనాటి నుండి యుద్ద ప్రయత్నాలు చేసి రక్తపాతం కల్గించకూడదు అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: