బుడుగు: పిల్లలు, యువతలో తలెత్తే మానసిక సమస్యలివే..!
అయితే వెద్య నిపుణులు మాదక ద్రవ్యాల వినియోగం, మానసిక ఒత్తిళ్లకు లోనవడం వల్ల జరిగే అనర్థాలు సమానంగా ఉంటాయన్నారు. వీటి వల్ల సమస్యలు ఎక్కువౌతు ఉంటాయని, అందుకే ప్రారంభదశలోనే సమస్యను పరిష్కరించేందుకు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించి తగిన సూచన తీసుకోవాల్సి వస్తుందన్నారు. అయితే మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు పిల్లలు ఎక్కువగా మాట్లాడరు. ఆ సమయంలో తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలపై ప్రేమగా మాట్లాడాలి. ఏదైనా సమస్యతో సతమతమవుతున్నాడని తెలిసినప్పుడు పిల్లలు తమంతట తాము చెప్పేలా మోటీవేట్ చేయాలి. భయపెట్టి చెప్పమని ఫోర్స్ చేయోద్దని, అప్పుడు చెప్పాల్సిన విషయం కూడా చెప్పలేరన్నారు. పిల్లలను ప్రేమగా దగ్గరికి తీసుకుని సమస్య తెలుసుకోవాలని, మానసిక వైద్యులను సంప్రదించాలి.
పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తినప్పుడు ప్రాథమికంగా మూడు రకాల చికిత్సలు చేస్తారని వైద్యులు పేర్కొన్నారు. పిల్లల సమస్య తీవ్రతను బట్టి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఇందులో పిల్లల మానసిక ఆలోచనతో హానికారకమైన పనులు చేస్తుంటారు. వారి ప్రవర్తనను గుర్తించి.. సమస్యను పరిష్కరించడానికి, కుటుంబసభ్యుల వల్ల ఎదైనా సమస్య తలెత్తుతుందా అనేది తెలుసుకోవడానికి తల్లిదండ్రులను కూడా అవసరమైన కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తోంది. మానసిక సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఎక్కువగా మాట్లాడరు.. అలాంటప్పుడు అందరితో ఫ్రెండ్లీగా కలిసి మాట్లాడటానికి ఇంటర్ పర్సనల్ థెరపీని ఉపయోగిస్తారు. విద్యార్థులయితే తరచూ ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతూ వారిలో మార్పును తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండాలి.