బుడుగు: మీ పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఇలా చేయండి..!?
ఇక పిల్లలను ప్రతిదానికి తిట్టకండి. కానీ పిల్లలు అహంకారంతో ప్రవర్తిస్తే మాత్రం తల్లిదండ్రులు వెంటనే స్పందించాలని చెబుతున్నారు చైల్డ్ కేర్ నిపుణులు.. పిల్లల ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు.. దానికి సంబంధించి పిల్లలపట్ల ఏదో తప్పు జరిగింది అన్న విషయాన్ని వెంటనే గ్రహించాల్సి ఉంది. మీ బిడ్డ మీతో అహంకారంతో ప్రవర్తిస్తే,బదులుగా మీకు వారి పై అధికారం ఉందని దగ్గరికి తీసుకోవాలి. అహంతో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో వివరంగా చెప్పాలి.అసలు సమస్యేంటి అనేది అడిగి తెలుసుకుని.. దానికి పరిష్కారం కూడా తెలియచేయాలి.
అయితే పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఏ విషయమైనా స్వేచ్ఛగా తెలియజేసే స్వతంత్రతను కల్పించాలి. ఎప్పుడూ స్ట్రిట్ గా ఉండడం అంత మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి. సరైన సమయంలో కమ్యూనికేషన్ జరిగితే, ఎన్ని లోపాలున్నా మీ అనుబంధం దెబ్బతిందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితులుగా ఉండాలి. వారికి నచ్చిన విషయాన్ని తెలుసుకోండి .
అంతేకాదు.. చెడు విషయాలు పక్కనపెట్టి దిశగా ఏం చేయాలో ఆలోచించండి అని వారు సూచిస్తున్నారు.కానీ వీటికి ముందు చేయవలిసింది ఏమిటంటే.. పిల్లలకు తనకంటూ సొంత ప్రవర్తన ఏమి ఉండదు.. తల్లి తండ్రిని చూస్తూ పెరుగుతారు. వారు ప్రతి విషయాన్ని మీ నుండే నేర్చుకుంటారు వారు చెప్పింది చేయరు…చేసింది చేస్తారు, అంటే మీరు ఏ విషయానికి ఎలా స్పందిస్తారో అలాగే వారు చేస్తారు కాబట్టి తల్లిదండ్రులు వారిలో ఉన్న లోపాలు ముందుగా దిద్దుకుంటే పరిస్థితి అదుపులో ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.