బుడుగు: పిల్లలకు సాధారణంగా వచ్చే ఏడు ఆరోగ్య సమస్యలు ఇవే..!?

N.ANJI
చిన్నపిల్లలు ఎక్కవగా అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఒక రోజు జలుబు, తగ్గిందనుకునేలోపే కడుపు నొప్పి, వర్ష కాలం వస్తే జ్వరం ఇలా ఎదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది. హాస్పిటల్ చుటూ తిరిగి మనం అలసి పోతుంటాము. ముఖ్యంగా పిల్లలు ఏడు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అవి ఏంటో చూద్దామా.
ఇక ముక్కు కారడం, తుమ్ములు, కొన్నిసార్లు దగ్గు కూడా మీ పిల్లలను వేధిస్తున్నాయా? సాధారణంగా 2-3 రోజుల కంటే ఎక్కువ జలుబు ఉంటుంది. ప్రధానంగా శీతాకాలం వర్ష కాలంలో పిల్లలు జలుబు ఎక్కువగా చేస్తుంది.జ్వరం పిల్లలకు చాలా చికాకు తెప్పించి నీరసంగా చేసేస్తుంది. ఇది జలుబు వలన లేదా ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. కొన్ని సార్లు ఏదయినా టీకాకు పరిచర్యగా కూడా రావచ్చు. కొందరు తల్లిదండ్రులు పిల్లల ఒళ్ళు కొంచెం వేడిగా అనిపించగానే డాక్టర్ దగ్గరకు వెళ్లిపోతుంటారు. కానీ 101 డిగ్రీల కంటే తక్కువ జ్వరం ప్రమాదకరమైనది కాదు. అందువలన స్వపంగా జ్వరం ఉంటె డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీరా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ముందు పిల్లల బట్టలు తీసెసి వారి శరీరం అంతా తడి గుడ్డతో తుదచండి. ఎక్కువ ద్వావ పదార్థాలు తీసుకునేలా చేయండి.
చిన్న పిల్లలు చెవి ఇన్ఫెక్షన్ కు సులువుగా లోనవుతుంటారు. దీని వలన వారికి చెవిలో చీము పట్టడం లేదా నొప్పి కలగడం జరుగుతుంటుంది. తరచుగా డైపర్స్ మార్చాల్సి వస్తోందా? గమనించండి, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. విరోచనాలకు వైరస్, బాక్టీరియల్ సంక్రమణ, ఆహార విషం లేదా అలెర్జీ కూడా కారణమని చెప్పవచ్చు. కొన్నిసార్లు మందులు వేయడం వలన కూడా విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. జలుబు, ఫ్లూ చిన్న పిల్లలలో అతి సాధారణంగా కనిపించే సమస్య. దీని భారిన పడితే పిల్లలు చాల చికాకుగ, దేని మీద అసతి లేకుండా ఉంటారు. ఇది సులువుగా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది. అందువలన దీని నివారించడం అంత సులువైన విషయం కాదు.
కండ్లకలక మీ పిల్లల కళ్ళను ఎర్రగా, కొంచెం ఊడినట్టు చేస్తుంది. ఇది కంటి శ్లేష్మ పొర యొక్క వాపు వలన సంభవిస్తుంది. ఇది సాధారణంగా ఒక కంటిలో మొదలై రెండు కళ్ళకు సోకుతుంది. ఇది ఒక వైరల్ సంక్రమణ వలన అయితే, సాధారణంగా ఒక వారంలో దానంతట అదే తగ్గిపోతుంది. మీ బిడ్డ కళ్ళను గోరు వెచ్చని నీటితో కడిగి శుభ్రంగా ఉంచండి. బ్యాక్టీరియా సంక్రమణ చికిత్సకు ఒక యాంటీబయోటిక్ డ్రాప్స్ ఉపయోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: