బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

N.ANJI
పిల్లలు పుట్టినప్పుడు ఎంత జాగ్రత్త ఉంటారో వాళ్ళు పెరుగుతున్న సమయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అయితే బిడ్డకు అన్నింటి కంటే ముఖ్యంగా తల్లి పాలు ఇవ్వడం వలన కావాల్సిన అన్ని పోషకాలూ లభిస్తాయి. ముఖ్యంగా బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలూ తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి.
ఆ తర్వాత మరో సంవత్సరం పట్టిస్తే మంచిదని అమెరికాలోని అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్‌టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్  పెడియాట్రిక్స్ అకాడమీ తెలియ చేసారు. పిల్లలకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ వంటివి తల్లి పాల తోనే  పిల్లలు పొందగలుగుతారు. తల్లి పాలు తాగిన పిల్లలు ఎంత బరువు ఉండా లో అంతే ఉంటారు. అధిక బరువు, అసలు బరువు లేకపోవడం వంటి సమస్యలు చాల తక్కువగా వస్తాయి.
ఇక తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు భవిష్యత్తు లో  అధిక బరువు ,షుగర్ వంటి సమస్యలు రావు . కాబట్టి  ప్రతి తల్లీ… బిడ్డ పుట్టిన ఏడాదిన్నర వరకు  తన పాలు పట్టించాలి అని అనుకోవడం  ఎంతో మేలు చేసే నిర్ణయం. బిడ్డకు సరిపడినన్నీ పాలు ఇవ్వగలగాలంటే..  తల్లి పోషకాలు ఉండే ఆహారం తింటూ, సంతోషం గా ఉండాలి. ఈ విషయం తల్లి ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి.
తల్లి బిడ్డకు పాలుపట్టడం  వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అయి  గర్భాన్ని ప్రెగ్నెన్సీకి ముందు ఏ పరిమాణం లో ఉందో ఆ పరిమాణం లో కి తిరిగి వచ్చేలా చేస్తుంది. యుటెరస్ నుంచీ వచ్చే రక్తాన్ని అదుపు లో ఉండేందుకు  కూడా తల్లి బిడ్డకు పాలిచ్చే విధానం ఎంతగానో  ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రతీ తల్లీ తమ బిడ్డలకు పాలు ఇచ్చేవిధం గా ప్రయత్నించాలి. బిడ్డలు ఆరోగ్యం గా పెరిగి తే, వాళ్లు బలమైన భావి భారత పౌరులుగా ఉంటారు. ఈ దేశానికి వీర సైనికుల్లా, రక్షణ కవచాల్లా తయ్యారవవుతారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: