బుడుగు: పిల్లలు మట్టిలో ఆడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

N.ANJI
నేటి సమాజంలో పిల్లలు చిన్న పిల్లలను కాలు మట్టిలో పెట్టకుండా పెంచుతున్నారు. ఇక పిల్లలను బయట ఆడుకోనివ్వకుండా ఇంట్లోనే ఆటలు ఆడిస్తూ ఉంటారు. ఇక బయటకు వెళితే కాలు విరగొడుతా అంటూ.. కాళ్లకు మట్టిని కూడా అంటనివ్వరు. కానీ పిల్లలను బయట ఆడుకోనివ్వక పోవడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరగదు అని మీకు తెలుసా..? పిల్లలు ఆరుబయట మట్టిలో ఆడుకుంటే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల వారు ఏ రోగాన్ని అయినా తట్టుకునే శక్తి సంపాదిస్తారని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి.
ఇక పిల్లలు కాంక్రీట్ తో కూడిన ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడం కంటే మట్టి గ్రౌండ్ లో ఆడుకోవడమే మంచిదని పలు పరిశోధనలు తెలిపాయి. మట్టితో కూడిన ప్లే గ్రౌండ్ లలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుంచి చర్మం తట్టుకోనేంత స్థాయిలో ఇమ్యూనిటీని పెంచుతుందని కొత్త రీసెర్చ్ వెల్లడించింది. అంతేకాదు దుమ్ము, బురద ప్రాంతాల్లో ఎక్కువసేపు ఆడుకునే పిల్లలు ఎక్కువగా ఆరోగ్యకరంగా ఉంటారని ఈ రీసెర్చ్ చెబుతోంది. ఫిన్లాండ్ లోని ఒక యూనివర్సిటీ దీనిమీద రీసెర్చ్ చేసింది.
అయితే 10 డేకేర్ సెంటర్లలో ఆడుకునే 3 నుంచి 5ఏళ్ల వయసు 75 మంది చిన్నారులపై ఈ రీసెర్చ్ చేశారు. మట్టి ప్రాంతంలో వచ్చే మార్పులతో పిల్లల చర్మం ఎలా ఫైట్ చేసిందో పరీక్షించారు. దీంతో పిల్లల రక్తంలో రోగనిరోధకశక్తి స్థాయి పెరిగిందని గుర్తించారు. ఇలా మట్టిలో ఆదుకునే పిల్లలను, కాంక్రీట్ లో ఆదుకునే పిల్లలను ఒక నెల వరకు పరిశీలించారు.
ఇక ఒక నెల తరువాత, సైంటిస్టులు పిల్లలందరి చర్మం, రక్తం, మలవిసర్జన నమూనాలను సేకరించారు. కొన్ని వారాలు గడిచాక.. సైంటిస్టులు ఆరోగ్యపరంగా ఈ పిల్లల మధ్య అనేక మార్పులను గుర్తించారు. ఇందులో మట్టిలో ఆదుకునే పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువైనట్లు గుర్తించారు. అందుకే మీ పిల్లలు ఆరుబయట మట్టిలో ఆడుకుంటే వద్దని చెప్పకండి.. అలా ఆడుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: