బుడుగు : మీ పిల్లలు శుభ్రముగా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లను నేర్పించండి..!!
ముఖ్యంగా ఉదయాన్నే లేచిన వెంటనే.. అలాగే రాత్రి అన్నం తిన్న తర్వాత తప్పకుండా దంతాలను శుభ్రం చేయించడం, నోరు పుక్కిలించడం లాంటివి చేయించాలి. అలాగే టంగ్ క్లీనర్ తో నాలుకను శుభ్రం చేయించడం కూడా నేర్పించాలి. అలాగే పిల్లలకు నేర్పించాలిసిన హైజీన్ లో బాడీ హైజీన్ ఒకటి. పిల్లలకు ప్రతి రోజు స్నానం చేసే అలవాటును నేర్పించండి . ప్రతి రోజు స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రం అవుతుంది. చర్మం మీద ఉన్న మృత కణాలు, దుమ్ము, ధూళి అంతా పోతుంది. పిల్లలకు స్నానం చేయించేటప్పుడు శరీరంలోని అన్ని భాగాలు అంటే చేతులు, పాదాలు, అరచేతులు, చంకలు, వీపు, తొడలు అన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే పిల్లలకు ప్రతిరోజు అండర్ వేర్ మార్చాలి..
ప్రతి రోజు శుభ్రంగా ఉతికిన బట్టలనే ధరించాలి. అంతే కాకుండా ఏదన్నా తినే సమయానికి ముందు చేతులు రెండు శుభ్రంగా కడుక్కుని తినడం నేర్పించాలి. వీలయితే సబ్బుతో గాని, లేడంటే హ్యాండ్ వాష్ అయిన ఉపయోగించాలి. అలాగే పిల్లలకు నేర్పాలిసిన హైజీన్ లో మరొకటి ఫుడ్ హైజీన్.. అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవడం, తిన్నాక ఎంగిలి అనేది చేతులకు లేకుండా కడుక్కోవడం నేర్పించాలి.. తినేటప్పుడు ఏ ఆహారం అయినాగాని కింద పడవేయకుండా తినడం నేర్పించండి. అలాగే కింద పడిన ఆహారాన్ని తిననివ్వకండి... !!