బుడుగు : ఏ ఏ వయసులో పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసుకోండి.. !!

Suma Kallamadi
పిల్లలకు ఈ వయసు నుంచి ఎలాంటి ఆహారం పెట్టాలో అన్న విషయం చాలా మంది తల్లి తండ్రులకు తెలియదు. అందుకనే అసలు పిల్లలకు ఏ వయసులో ఏమి ఆహారం పెట్టాలో అనే విషయాలు గురించి తెలుసుకుందాం.. !!మొదటగా కూర్చుంటున్న పిల్లలకు(6నుంచి 8 నెలల వయస్సు) కొంచెం జారుగా, గుజ్జుగా, మెత్తగా మెదిపిన ఆహారం పెట్టాలి. ఏదైనా ధాన్యపు రవ్వలతో జావ చేయవచ్చు. అరటిపండ్లు, యాపిలు, క్యారెట్స్, పాలకూర వంటి వాటిని ఉడికించి మెత్తగా గుజ్జు చేసి నేరుగా  లేదా తల్లి పాలతో కలిపి ఇవ్వవచ్చు.బియ్యం, గోధుమలు మొదలైన ధాన్యాలను పప్పులతో కలిపి మెత్తగా ఉడికించి ఉప్మా, హల్వ తినిపించవచ్చు.





అలాగే పిల్లలు పాకే వయస్సులో (8 నుంచి 10 నెలలు) ఉడికించిన క్యారెట్, బీట్రూట్, అరటి, ఆపిల్ ముక్కలు పెట్టాలి. మెత్తగా వండిన అన్నం లేదా కిచిడిని ఏదైనా కూరతో కలిపి పెట్టాలి. ఇంకా పాలల్లో నానబెట్టిన ఓట్స్ తినిపించవచ్చు.అలాగే పిల్లవాడు నిలబడే వయస్సులో(10-12 నెలలు) ఉడికించిన గుడ్డులోపలి పచ్చ సొన, ముక్కలుగా చేసిన కోడి గుడ్డు, మెత్తగా వండిన మాంసపు ముక్కలు పెట్టాలి  మెత్తగా ఉండి నోట్లో వేసుకుంటే నానిపోయే  చిరు తిండ్లు కూడా పెట్టవచ్చు.






అలాగే నడిచే వయస్సులో(12 నెలలు)తక్కువ పరిమాణంలో పెద్దవారు తీసుకునే ఆహారం పెట్టాలి. పరాటా, బ్రెడ్ టోస్ట్ మరమరాల ఉప్మా వంటి టిఫిన్లు పెడుతూ ఉండాలి. మాట్లాడే వయస్సులో(18 నెలలు)రకరకాల పరిమాణాలలో ఉండే తిను బండారాలు పెట్టాలి. పెరుగు,పన్నీరు, పాయసం, పాలు పండ్లతో చేసిన జ్యూస్లు, జీడి పప్పు,వేరు శెనగ పప్పు,  బాదం పప్పుల గుజ్జు లేదా పొడులు.పరుగు నేర్చే వయస్సులో(24 నెలలు)అన్ని రకలా సమతుల్య ఆహారం పెట్టాలి..పైన పైన తెలిపిన విధంగా మీ పిల్లల వయసును బట్టి సరితూగే ఆహారాన్ని పిల్లలకు పెట్టండి.పిల్లలు కూడా పోషకాహార లోపం నుంచి బయట పడతారు. మంచి ఎదుగుదలతో పెరుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: