బుడుగు :పిల్లలలో వైరల్ ఫీవర్ తగ్గించే ఇంటి చిట్కాలు...!

Suma Kallamadi
చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఒక సీజన్ నుంచి మరో సీజన్ లోకి మారితే రకరకాల ఇన్ ఫెక్షన్లు పిల్లలకు సోకుతాయి.ఎక్కువగా పిల్లలకు వైరల్‌ ఫీవర్స్‌ వస్తూ ఉంటాయి. చాలామంది పిల్లలలో వైరల్ ఫీవర్ ను పెద్దగా పట్టించుకోరు. ఎదో జ్వరం మందు వేసి వదిలేస్తారు. కాని వైరల్‌ ఫీవర్స్‌ పిల్లలకు రావడం మాత్రం సీరియస్‌గా పరిగణించాలి. సీజన్ లో ప్రతి పదిమందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన ఇన్ ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. పిల్లలకు వైరల్‌ ఫీవర్స్‌ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.


వైరల్‌ ఫీవర్స్‌ ఎటాక్‌ అవ్వగానే ఆ మందులు ఈ మందులు, ఆ సూదులు అంటూ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా కొన్ని సహజ పద్దతుల్లో ఆ ఫీవర్‌ను తగ్గించుకోవచ్చు. ఆ పద్దతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇప్పుడు చెప్పబోయే పదార్ధాలు అన్ని మన ఇంట్లోనే దొరుకుతాయి   రెండు స్పూన్‌ ల ఆవ నూనె తీసుకుని అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి నూనెలో వేసి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి బాగా మర్దన చేయాలి. దాంతో జర్వం చాలా వరకు తగ్గే అవకాశాలుంటాయి.వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకు ఎక్కువగా నీళ్లు తాగించాలి.పిల్లలకు జర్వం వచ్చిన సమయంలో వారిలో రోగ నిరోధక శక్తి పెంచాల్సిన అవసరం ఉంటుంది.


అందుకే మొదట వారికి రెండు టీ స్పూన్‌ ల తేనెలో కాస్త అల్లం రసంను వేసి తాగించాలి. దాంతో వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేడి నీళ్లలో దాల్చిన చెక్క వేసి మరిగించి ఆ నీటిని తాగించడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ధనియాలతో కషాయం తయారు చేసి పిల్లలకు తాగించడం వల్ల కూడా వైరల్‌ ఫీవర్‌ తగ్గుతుంది. ధనియాలను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ తర్వాత వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాపించాలి. ఇలా చేయడం వల్ల కూడా వైరల్‌ ఫీవర్‌ తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: